Business Success story : చాలా మంది ఏదైనా కష్టం వస్తే ఒక్కసారిగా కుంగిపోతారు. కానీ పరాజయల్నే పునాదులుగా మలచుకుని కొందరు విజయసౌధాలు నిర్మిస్తారు. అలాంటి కోవకు చెందినవారే.. ప్రముఖ వ్యాపారవేత్త, బిగ్ బాస్కెట్ ఫౌండర్ హరి మీనన్. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ.13,500 కోట్లు. ఇదంతా ఒక్కసారిగా వచ్చిన విజయం కాదు. భారీ విజయం అందుకునే దిశలో.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. తరువాత చిన్న చిన్న విజయాలు సాధించారు. వాటిని దాటుకుంటూ మరిన్ని అడుగులు ముందుకు వేశారు. నేడు అత్యున్నత స్థాయికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
బిగ్ బాస్కెట్ స్థాపన
Big Basket Hari Menon Net Worth : హరి మీనన్ తన స్నేహితులతో కలసి బిగ్ బాస్కెట్ అనే రిటైల్ సంస్థను స్థాపించారు. ఆన్‌లైన్‌లో వస్తువుల డెలివరీ ఈ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లలో.. బిగ్ బాస్కెట్ అంటే తెలియని వాళ్లుండరు. కానీ.. ఈ పాపులారటీ వెనుక హరి మీనన్ చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం హరి మీనన్ ఆస్తి విలువ అక్షరాల రూ.13,500 కోట్ల పైమాటే!
బాల్యం, విద్యాభ్యాసం
Big Basket Hari Menon Education : ముంబయిలోని బాంద్రాలో 1963లో ఓ మధ్యతరగతి కుటుంబంలో హరి మీనన్ జన్మించారు. కేరళ యూనివర్సిటీలో (బీటెక్) మెకానికల్ ఇంజినీరింగ్‌లో (1983లో) గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పెన్సిల్వేనియాలోని కార్నిగీ మిలన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు.
క్రికెట్ అంటే ఇష్టం!
Big Basket Hari Hobbies : చిన్నప్పుడు క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి కలిగిన హరి మీనన్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. ది ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో హరి మీనన్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ చేశారు. నిరంతరం ఎడ్యుకేషన్ కొసాగిస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడం హరి మీనన్ ప్రత్యేకత.
కేరీర్ ప్రారంభం
Big Basket Hari Career : బీటెక్ పూర్తయిన తర్వాత హరి మీనన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేసిన హర మీనన్... మేనేజర్ స్థాయికి ఎదిగారు. వివిధ కంపెనీల్లో సీనియర్ డైరెక్టర్ హోదాలో, వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో పని చేశారు.
సొంత వ్యాపారం
Big Basket Hari Menon Business : ఏళ్ల తరబడి ఉద్యోగంలో వివిధ కీలక హోదాలు నిర్వహించిన హరి మీనన్ 2004లో ఉద్యోగం వదిలేసి... టుమ్రీ సంస్థ ద్వారా సొంత వ్యాపారం ప్రారంభించారు. ఈ కంపెనీని 2012 వరకు కొనసాగించారు. కలెక్టివ్ మీడియా అక్వైర్ చేసిన తర్వాత అడోబ్‌లో టుమ్రీ ముఖ్యమైన భాగంగా మారింది.
Hari Menon Big Basket Success : అంచెలంచెలుగా ఎదిగినా... ఇంకా ఏదో సాధించాలనే తపనతో హరి మీనన్ పని చేసేవారు. ఐదుగురు మిత్రులతో కలసి ఆన్‌లైన్ స్టోర్ ఫ్యాబ్‌మార్ట్ వెబ్‌సైట్ స్టార్ చేశారు. ఈ కంపెనీ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలతో సమాంతరంగా ఏడాదికి పైగా పని చేసింది. అయినా కూడా ఇంకా ఏదో సాధించాలనే తపన హరి మీనన్‌ను వెంటాడింది. దీనితో ఆ స్టోర్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్‌కు విక్రయించారు. అనంతరం ఫిజికల్ లొకేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే బిగ్ బాస్కెట్. 2011లో ఒక్క స్టోర్ కూడా ఓపెన్ చేయలేని స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన బిగ్ బాస్కెట్ నేడు 300 స్టోర్లకు విస్తరించింది.