ETV Bharat / business

BSNL Plans To Launch 4G Service : త్వరలో BSNL 4జీ సేవలు ప్రారంభం.. 5జీ 'స్పెక్ట్రమ్' ఉంది కానీ.. - ఎయిర్​టెల్​ వన్​వెబ్​ శాటిలైట్ కమ్యూనికేషన్స్

BSNL Plans To Launch 4G Service In Telugu : బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు డిసెంబర్‌ నుంచి ప్రారంభమవుతాయన్నారు ఆ సంస్థ సీఎండీ పీకే పూర్వార్. 2024 జూన్‌కల్లా దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా వన్​వెబ్​ సాటిలైట్​ కమ్యూనికేషన్​ సర్వీస్​ను ప్రారంభించేందుకు సిద్ధమైంది ఎయిర్​టెల్.

BSNL plans to launch 4G service in December
bsnl 4g launch latest news
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 6:39 PM IST

BSNL Plans To Launch 4G Service : బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు ఈ డిసెంబర్‌ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ పీకే పూర్వార్​ వెల్లడించారు. పంజాబ్‌లో మొదట ఈ సేవలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. క్రమంగా ఈ సేవలు దేశమంతా విస్తరిస్తామని తెలిపారు. దిల్లీలో జరుగుతున్న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో పీకే పూర్వార్ ఈ అంశాన్ని వెల్లడించారు.

4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పుర్వార్‌ తెలిపారు. ఆ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌లో తొలి దశలో కొన్ని చోట్ల ఈ సేవలు ప్రారంభించి.. దశలవారీగా ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తామని చెప్పుకొచ్చారు. 2024 జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పుర్వార్‌ వెల్లడించారు. 4జీ విస్తరణ పూర్తయ్యాక 5జీ సర్వీసులు కూడా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

బీఎస్​ఎన్​ఎల్​ 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌ చేసే బాధ్యతను ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌కు అప్పగించింది. కొద్ది రోజుల క్రితమే ఈ డీల్​ కుదిరింది. 5జీ సేవలను ప్రారంభించేందుకు కావాల్సిన స్పెక్ట్రమ్‌ కూడా తమ వద్ద అందుబాటులో ఉందని పీకే పూర్వార్​ తెలిపారు.

ఏ రంగాల వారికి ముందుగా 5జీ సేవలు :

ఎయిర్​టెల్​ వన్​వెబ్​ సాటిలైట్​ కమ్యూనికేషన్​ సర్వీస్..
దేశ వ్యాప్తంగా వన్​వెబ్​ సాటిలైట్​ కమ్యూనికేషన్​ సర్వీస్​ తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్​టెల్​. నవంబర్​ నుంచి ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. దిల్లీలో జరుగుతున్న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు ఆ సంస్థ ఛైర్మన్​ సునీల్​ మిత్తల్​. దేశంలో ఎక్కడి నుంచి అయిన ఈ సేవలను పొందొచ్చని ఆయన తెలిపారు.

జియోస్పేస్​ఫైబర్​తో​.. ఇకపై దేశంలో జెట్​ స్పీడ్​తో 5జీ​ సేవలు!
Reliance Jio Unveils JioSpaceFiber : రిలయన్స్ జియో కూడా తాజాగా జియోస్పేస్​ఫైబర్​ సేవలను ప్రారంభించింది. ఈ శాటిలైట్ నెట్​వర్క్​ ఆధారిత సర్వీస్​తో.. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం గిగాబిట్​ బ్రాడ్​​బ్యాండ్​ సర్వీసులను అందించడానికి రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ సదుసాయం లేని ప్రాంతాలకు కూడా.. దీని ద్వారా వేగవంతమైన బ్రాండ్‌బ్యాండ్‌ సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్​లోనే ఈ విషయాన్ని వెల్లడించింది జియో.

ఫ్రీగా అన్​లిమిటెడ్ 5జీ డేటా.. ఆ యూజర్లకు మాత్రమే.. కండీషన్స్ అప్లై!

How to get Airtel Data loan : మీకు ఈ విషయం తెలుసా? ఎమర్జెన్సీ సమయంలో అదనపు డేటా పొందవచ్చు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.