BSA Gold Star 650 Vs Royal Enfield Interceptor 650 : మోటార్ సైకిళ్ల తయారీ రంగంలో ప్రత్యేక ఒరవడిని సృష్టించి.. తనదైన బ్రాండ్ సెట్ చేస్కున్నది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్. ద్విచక్ర వాహనాల్లో ఎన్ని బ్రాండ్స్, మోడల్స్ ఉన్నా.. రాయల్ ఎన్ఫీల్డ్లో ఉండే రాజసమే వేరు అంటారు ఈ బైక్ ఫ్యాన్స్. దాని ప్రత్యేకమైన ఆహార్యం నుంచి అది చేసే శబ్ధం, దూసుకెళ్లే వేగం.. అన్నీ తనకు మాత్రమే సొంతం అనేలా ఉంటాయి. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ బైక్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. కొద్ది నెలల క్రితమే.. Royal Enfield Interceptor 650 మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. దీనికి పోటీగా త్వరలో భారత మార్కెట్లోకి బ్రిటీష్ కంపెనీ బీఎస్ఏ సిద్ధమవుతోంది. ఈ కంపెనీ తన నయా బైక్ "BSA Gold Star 650"తో రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield)కు పోటీగా వస్తోంది. ఇంతకీ ఏ రెండింటిలో ఉన్న ఫీచర్స్ ఏంటి..? దేని ధర ఎంత? అన్న వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బీఎస్ఏ 650 స్పెసిఫికేషన్స్ (BSA Gold Star 650 Specifications) :
- బ్రిటీష్ కంపెనీ బీఎస్ఏ తీసుకొస్తున్న BSA Gold Star 650 బైక్‌లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి.
- ఈ బైక్ లిక్విడ్ కూల్డ్, సింగిల్-సిలిండర్, 652cc ఇంజిన్‌తో వస్తుంది.
- ఇది 6000ఆర్పీఎం వద్ద 45.6 Ps, అలాగే 4000ఆర్పీఎం వద్ద 55 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
- ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.
- BSA కొత్త ఇంజిన్ 1800 rpm కంటే తక్కువ నుంచి టార్క్‌ను పెంచడం ప్రారంభిస్తుంది.
- తరచుగా గేర్‌ను మార్చకుండా ఉండటానికి సహాయపడుతుంది.
- BSA గోల్డ్ స్టార్ 650లో బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 320mm, వెనుక 255mm డిస్క్‌ను అమర్చారు.
- ఈ బైక్‌లో 12 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది.
- అలాగే DOHC, 4 valves per cylinder, twin spark plugs ఉన్నాయి.
- ఈ బైకు సుమారు 213 కిలోల బరువు ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 స్పెసిఫికేషన్స్ (Royal Enfield Interceptor 650 Specifications) :
- రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది.
- ఇంటర్‌సెప్టర్ 650 ట్విన్-సిలిండర్ కలిగి 648 cc ఇంజిన్‌తో వస్తోంది.
- ఇది 7150 rpm వద్ద 47.65 Ps, 5250 rpm వద్ద 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ట్రాన్స్‌మిషన్ విధులు స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.
- అలాగే Parallel twin, 4-స్ట్రోక్, సింగిల్ ఓవర్‌హెడ్ క్యామ్, ఎయిర్/ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌లను కలిగి ఉంది.
- ముందు భాగంలో 320 mm డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో 240 mm డిస్క్ బ్రేక్‌లు అమర్చారు.
- డ్యూయల్-ఛానల్ ABS ద్వారా అవి పనిచేస్తాయి.
- ఈ బైక్‌ను 202 కేజీల బరువుతో రూపొందించారు.
KTM Duke New Model 2023 : అదిరే ఫీచర్స్‌తో నయా కేటీఎం డ్యూక్ బైక్స్ .. ధర ఎంతంటే?
BSA గోల్డ్ స్టార్ 650 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ధర : BSA.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంటే ప్రీమియం బ్రాండ్‌గా స్లాట్ చేయబడింది. దీనిని బట్టి చూస్తే.. గోల్డ్ స్టార్ 650 భారతదేశంలో రూ. 5 లక్షల నుంచి ధర మొదలవ్వొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ధర రూ. 2.81 లక్షల నుంచి 3.03 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా. రాయల్ ఎన్‌ఫీల్డ్ రంగును బట్టి ధర మారుతూ ఉంటుంది.
Bikes Launched In October 2023 : స్టన్నింగ్ ఫీచర్స్‌తో.. సూపర్ బైక్స్ లాంఛ్.. ధర ఎంతంటే?
Hero Scooter New Model 2023 : హీరో డెస్టినీ ప్రైమ్ స్కూటర్ లాంఛ్.. ఫీచర్స్ అదుర్స్.. ధర ఎంతంటే?