ETV Bharat / business

Covaxin Vaccine: కొవాగ్జిన్​ ఉత్పత్తిని తగ్గిస్తున్నాం: భారత్​ బయోటెక్​ - ప్రపంచ ఆరోగ్య సంస్థ

Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్​ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్ విజృంభణ తగ్గిందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనతో దాదాపుగా అందరూ టీకా తీసుకున్నారని కాబట్టి ప్రస్తుతం డిమాండ్ తగ్గిందని ఆ సంస్థ తెలిపింది.

Bharat Biotech
భారత్ బయోటెక్ సంస్థ
author img

By

Published : Apr 2, 2022, 4:28 AM IST

Bharat Biotech covaxin: కరోనా వ్యాక్సిన్​ 'కొవాగ్జిన్​' ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్​ తెలిపింది. దేశంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గడం సహా కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనతో దాదాపు అందరూ టీకాను తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం డిమాండ్ తగ్గిపోయిందని తెలిపింది. దీనిని ముందుగానే గ్రహించామని భారత్​ బయోటెక్​ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీలో నూతన సాంకేతికత అభివృద్ది చేయడం తదితర కార్యకలాపాలపై దృష్టిసారిస్తున్నట్లు పేర్కొంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ఎమర్జెన్సీ యూసేజ్ లిస్ట్​లో కొవాగ్జిన్​ టీకా ఉందని గుర్తుచేసిన భారత్ బయోటెక్.. ఇటీవల డబ్ల్యూహెచ్​వో.. తమ సంస్థలో చేసిన తనిఖీల్లో సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. డబ్ల్యూహెచ్ఓ చేసిన పలు సూచనలు పాటిస్తున్నామన్నారు. ఎంతో పకడ్బందీగా పరీక్షలు చేసి కొవాగ్జిన్​ను తయారుచేశామన్న సంస్థ.. మార్కెటింగ్ నిఘా కార్యకలాపాలలో అద్భుతమైన భద్రతను, సమర్థతను కనబరిచిందని తెలిపింది. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: పెరిగిన సిలిండర్​ ధరలు.. రికార్డు స్థాయికి ఏటీఎఫ్​.. పెట్రోల్​ రేట్లు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.