Best Term Plan With Return Of Premium : మన జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అందుకే సరైన ఆర్థిక ప్రణాళికలు కలిగి ఉండటం ముఖ్యం. ఒక బలమైన ఆర్థిక ప్రణాళిక అనేది.. కుటుంబానికి స్థిరత్వాన్ని, భవిష్యత్తుకు భరోసాను ఇస్తుంది. అందుకే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇది జీవిత బీమాను అందించడమే కాకుండా.. పాలసీదారుడు మరణించిన తరువాత అతని కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
జీవిత బీమా పాలసీల్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా కీలకమైనది. ఇందులోని ప్రత్యేకతలు ఏంటంటే.. ఈ టర్మ్ ప్లాన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండి అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఒక ప్రతికూలత ఏమిటంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్ లేకపోవడం. కానీ కొంత మంది జీవిత బీమా కల్పిస్తూనే.. పాలసీ టెన్యూర్ తరువాత.. అప్పటి వరకు కట్టిన ప్రీమియం కూడా వెనక్కు రావాలని ఆశిస్తూ ఉంటారు. అలాంటి వారికి వరం లాంటిదే టెర్మ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ (TROP).
టీఆర్ఓపీ అంటే ఏమిటి?
What Is Term Return Of Premium Plan : టర్మ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లు అనేవి.. టర్మ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ రెండింటినీ మిళితం చేసే ఒక ప్రత్యేకమైన బీమా పాలసీ. ఇతర సంప్రదాయ టర్మ్ పాలసీలు మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ను అందిచవు. కానీ TROP లు వాటిని అందిస్తాయి. ఈ ప్లాన్లలో పాలసీ వ్యవధిలో పాలసీదారుడు జీవించి ఉంటే.. వారు ఆ వ్యవధిలో చెల్లించిన మొత్తం ప్రీమియంను రిఫండ్‌గా పొందుతారు. ఈ సౌకర్యమే TROP లను ఇతర పాలసీల నుంచి వేరుపరిచి ప్రత్యేకంగా నిలిపుతాయి. పాలసీదారుడు ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తున్నప్పుడు సైతం అందులో కొంత మొత్తాన్ని తిరిగి అందుకునే సౌలభ్యం ఇందులో ఉంది. అందుకే వినియోగదారులు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.
What Is Top Up Health Insurance Policy : హెల్త్ ఇన్సూరెన్స్ టాపప్‌తో మరింత ధీమా.. ఈ లాభాలు తెలుసా?
TROP Benefits :
- ప్రీమియం బ్రేక్ : పాలసీదారులు ఈ విధానం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. పాలసీ నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట సంఖ్యలో ప్రీమియాలను స్కిప్ చేయవచ్చు.
- జీవిత భాగస్వామికి అదనపు కవరేజ్ : పాలసీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో, బీమా సంస్థలు సూచించిన ప్రీమియం మొత్తాన్ని రీఫండ్ చేయడమే కాకుండా.. పాలసీ హోల్డర్ జీవిత భాగస్వామికి అదనపు కవరేజ్‌ను కూడా కల్పిస్తాయి.
- పిల్లలకు ఆర్థిక రక్షణ : TROP ప్రణాళికలు.. పాలసీదారుల కుటుంబ భవిష్యత్తును మాత్రమే కాకుండా, పాలసీ నిబంధనల ప్రకారం నిర్దిష్ట వయస్సు వరకు వారి పిల్లలకు ఆర్థిక భద్రతను కల్పిస్తాయి.
- సంపాదన లేని వ్యక్తులకు మినహాయింపు : పాలసీదారు ప్రీమియం మొత్తాన్ని సరిగ్గా చేయలేకపోతే, ఆ ప్లాన్ తక్కువ కవరేజీతో కొనసాగుతుంది.
మొగ్గుకు ప్రధాన కారణమిదే..!
TROP ప్లాన్‌లు.. ఒక వ్యక్తితో పాటు మొత్తం కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతను అందించడానికి, జీవిత బీమా సహా, మంచి పొదుపు చేసుకోవాలనుకునే వారికి అనుకూలం. ఉదాహరణకు.. ఎవరైనా ఒక వ్యక్తి 20 సంవత్సరాల TROP ప్లాన్‌ని కొనుగోలు చేసి, పూర్తి కాల వ్యవధి వరకు జీవించి ఉంటే.. అతను చెల్లించిన మొత్తం ప్రీమియంను రీఫండ్‌గా పొందుతాడు. దీని వల్ల ఆ నిధుల్ని తన భవిష్యత్తు లక్ష్యాలకు ఖర్చుపెట్టడం, పదవీ విరమణ ప్రణాళికకు లేదా ఇతర ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ కారణంగా చాలా మంది ఈ ప్లాన్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. అయితే.. మీరు మీ ఆర్థిక పరిస్థితి, బడ్జెట్లకు అనుగుణంగా ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
Different Types of Insurance Policies : బీమాలో రకాలెన్ని? ఏవి తీసుకోవాలో మీకు తెలుసా..?