ETV Bharat / business

Best Pension Plan : రోజుకు 7 రూపాయల పెట్టుబడి.. నెలకు రూ.5వేల పెన్షన్.. ఈ స్కీమ్​ తెలుసా..? - అటల్ పెన్షన్ యోజన

Best Pension Plan in India : మీరు వృద్ధాప్యంలో ఎలాంటి ఆర్థిక సమస్యలూ ఎదుర్కోకూడదు అనుకుంటున్నారా? అయితే.. ఇప్పుడే మేము చెప్పబోయే స్కీమ్​లో చేరి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5వేలు పెన్షన్​గా పొందండి. దీని కోసం వందలు, వేలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రోజుకు కేవలం 7 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఇంతకీ ఏంటి ఆ స్కీమ్? ఎలా చేరాలి? అర్హతలేంటి? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.

Get Rs 5000 per Month after 60 Years
Best Pension Plan
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 2:47 PM IST

Get Rs 5000 per Month after 60 Years : దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. పేదలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారనే ఉద్దేశంతో కేంద్రం వివిధ స్కీమ్స్​ను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే పదవీ విరమణ లేదా వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా కేంద్ర సర్కార్ సరికొత్త పెన్షన్ స్కీమ్​(Pension Scheme)ను తీసుకొచ్చింది. దీనిలో చేరినట్లయితే మీరు 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5వేల పెన్షన్ పొందవచ్చు. వృద్ధాప్యంలో ఎవరి సహాయం అవసరం లేకుండా మీరు కేంద్రం నుంచి వచ్చే ఈ పెన్షన్​తో జీవితాన్ని హాయిగా ముందుకు సాగించవచ్చు. చాలా మంది నిరుపేద, సామాన్య ప్రజలు పెన్షన్​ స్కీమ్​లలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేక వెనకడుగువేస్తుంటారు. అలాంటి వారు కూడా కేవలం రోజుకు 7 రూపాయలు మాత్రమే చెల్లించే ఈ పెన్షన్​ స్కీమ్​లో ఈజీగా చేరవచ్చు. ఇంతకీ ఏంటి ఆ స్కీమ్? అర్హతలేంటి? ఏ విధంగా దీనిలో చేరాలి? లాంటి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Atal Pension Yojana : కేంద్ర ప్రభుత్వం 2015-16లో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, తక్కువ ఆదాయ వర్గ వ్యక్తుల పదవీ విరమణ జీవితానికి ఆధారాన్ని అందించేందుకు అటల్ పెన్షన్ యోజన(APY) అనే స్కీమ్​ను తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరడం ద్వారా 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు రూ. 1,000 నుంచి గరిష్ఠంగా రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్​లో మీ పెట్టుబడితో పాటు, ప్రభుత్వం సంవత్సరానికి రూ. 1,000 వరకు నిధులను కూడా అందిస్తుంది.

ఈ స్కీమ్ అర్హతలు ఏమిటి?

Atal Pension Yojana Eligibility Criteria : ప్రభుత్వ నియమాల ప్రకారం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. అందువ‌ల్ల 18 సంవ‌త్స‌రాలు నిండి చ‌దువుకుంటున్న‌ విద్యార్థులు కూడా ఈ స్కీమ్​లో చేరి త‌మ భ‌విష్య‌త్తు ప‌ద‌వీవిర‌మ‌ణ జీవితం కోసం పెట్టుబ‌డి పెట్ట‌వచ్చు. అలాగే, 40 ఏళ్ల త‌ర్వాత దీనిలో చేరేందుకు అర్హ‌త లేదు. అలాగే దీనిలో చేరేవారు ఏ ఇతర ప్రభుత్వ ప్రాయోజిత సామాజిక భద్రతా పథకాలను కలిగి ఉండకూడదు. అదేవిధంగా పన్ను చెల్లింపుదారుగా కూడా ఉండకూడదు.

ఏపీవై స్కీమ్​లో ఎలా చేరాలంటే.. అటల్ పెన్షన్ యోజన స్కీమ్​లో పెట్టుబడి పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో కూడా పెట్టుబడి పెట్టి ఈ పెన్షన్​ పథకంలో చేరవచ్చు. అలాగే ఈ స్కీమ్​లో చేరిన వారు ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

How To Choose Best Pension Plan For Retirement : రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలా?.. సరైన పింఛన్​ ప్లాన్​ రెడీ చేసుకోండిలా..!

నెలకు రూ.5,000 పెన్షన్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అటల్ పెన్షన్ యోజన స్కీమ్​లో చేరేందుకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. ఉదాహరణకు మీరు నెలకు రూ. 5000 పెన్షన్ పొందాలని భావిస్తున్నారు అనుకుందాం. ప్రస్తుతం మీ వయస్సు 18 సంవత్సరాలు అనుకుంటే.. మీ ఉద్యోగ విరమణ వయస్సు ఇంకా 42 సంవత్సరాలు (అరవై ఏళ్లు) ఉంటుంది. ఉద్యోగ విరమణ వయస్సు వచ్చే వరకు ఇందులో నెలకు రూ.210 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. అంటే.. రోజుకు రూ.7 చొప్పున మీరు ఇన్వెస్ట్ చేయ్యాలి అన్నమాట. అదే ఒకవేళ మీ వయస్సు 40 సంవత్సరాలు అనుకుంటే మీరు 20 ఏళ్లపాటు నెలకు రూ. 1454 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న వయస్సులోనే ఈ స్కీమ్​లో చేరడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.

అటల్ పెన్షన్ యోజన కంట్రిబ్యూషన్ చార్ట్ ప్రకారం.. మీరు 18 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే ప్రతి నెలా కనీసం రూ. 210 పెట్టాలి. అదే మీరు కొంచెం ఆలస్యంగా 25 సంవత్సరాలకు ప్రారంభిస్తే.. మీ నెలవారీ రూ.376 పెట్టుబడి పెట్టాలి. అదే 30 సంవత్సరాల వద్ద అయితే నెలకు రూ.577, 35 ఏళ్ల వద్ద అయితే మీరు నెలవారీ రూ. 902 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ స్కీమ్​లో మీ వయస్సుకి తగ్గట్టు నెలవారి పెట్టుబడి పెట్టి సింపుల్​గా పదవీవిరమణ తర్వాత మీరు నెలకు రూ.5వేలు పెన్షన్​గా పొందండి.

How to Generate 50K per Month from NPS : రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.50వేలు పెన్షన్ .. ఈ పథకం తెలుసా..?

Planning For Retirement : రిటైర్మెంట్​​ కోసం ప్లాన్​ చేస్తున్నారా?.. ఈ పొరపాట్లు చేయవద్దు!

NPS Scheme Benefits : రోజుకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.57 వేలు పెన్షన్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.