ETV Bharat / business

పర్సనల్​ లోన్ తీసుకుంటున్నారా? అంతకన్నా తక్కువ వడ్డీకే రుణాలు! - పర్సనల్ లోన్ కంటే బెటర్ లోన్ ఆప్షన్స్

Best alternatives for Instead of Personal Loans : డబ్బు అత్యవసరం. ఎవరిని అడిగినా ఫలితం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది "పర్సనల్ లోన్​" వైపు చూస్తున్నారు. కానీ.. అక్కడ వడ్డీ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ.. అవసరం వేధిస్తుండడంతో అనివార్యంగా తీసుకుంటున్నారు. అయితే.. మేము చెప్పే ఈ మూడు మార్గాల ద్వారా తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు!

Best alternatives for Instead of Personal Loans

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 11:06 AM IST

Best alternatives for Instead of Personal Loans : ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో.. డబ్బు అత్యవసరం అవుతుంది. తెలిసిన వారిని ఎవరిని అడిగీనా.. చాలా సార్లు "లేవు" అనే సమాధానమే వస్తుంది. అలాంటి సమయంలో చాలా మందికి గుర్తొచ్చేది పర్సనల్ లోన్(Personal Loan). ఇక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈ లోన్స్ పొందడం మరింత ఈజీ అయింది.

అయితే.. వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు విధించే వడ్డీరేట్లు.. ఇతర రుణాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి ష్యూరిటీ, సెక్యూరిటీ లేకుండా ఇస్తారు కాబట్టి ఇక్కడ వడ్డీరేట్లు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ.. అవసరాలు వేధిస్తుంటాయి కాబట్టి చాలా మంది పర్సనల్​ లోన్స్​ తీసుకుంటారు. అధిక వడ్డీలు చెల్లిస్తూ వస్తారు. అయితే.. మేము చెప్పే మార్గాలను అనుసరిస్తే.. తక్కువ వడ్డీకే లోన్స్ పొందవచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన పని లేదు. మరి, ఆ మార్గాల్లో మీకు ఛాన్స్ ఉందేమో ఓ సారి చూడండి.

పీపీఎఫ్ ద్వారా..

మీరు ఏదైనా జాబ్ చేస్తుట్లయితే.. తప్పనిసరిగా పబ్లిక్ ప్రావిడెంట్​ ఫండ్(PPF)​ అకౌంట్ ఉంటుంది. ఇందులో ఉన్న డబ్బుపై మీరు రుణం పొందొచ్చు. ఇందుకోసం.. మీ పీపీఎఫ్ అకౌంట్ తీసి కనీసం ఏడాది అయినా ఉండాలి. అప్పుడు మీ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు ఆధారంగా మీరు లోన్ అమౌంట్​ను పొందుతారు. పీపీఎఫ్​ అకౌంట్​లో ఉన్న మీ సొమ్ముకు 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ సొమ్ముపై మీరు లోన్ తీసుకుంటే.. 8.1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు పర్సనల్ లోన్​పై అందించే వడ్డీరేటుతో పోల్చితే.. ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.

Personal Loan Tips: పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలియకపోతే అంతే!

బంగారం ద్వారా..

తక్కువ వడ్డీకి లోన్ పొందడానికి ఉన్న మరో అవకాశం.. బంగారం. అనుకోకుండా తక్షణమే డబ్బు అవసరం పడింది. కానీ.. మీరు జాబ్ చేయట్లేదు. మీకు పీపీఎఫ్ అకౌంట్ లేదు. ఇలాంటప్పుడు.. వెంటనే పర్సనల్​ లోన్​ వరకూ వెళ్లకండి. మీ ఇంట్లో బంగారం ఉంటే.. మొదటి ఆప్షన్‌ గోల్డ్‌ లోన్‌(Gold Loan)కే ఇవ్వండి. బ్యాంకులు పర్సనల్ లోన్ కంటే.. మీరు బంగారం తాకట్టు పెట్టి తీసుకునే లోన్​పై.. తక్కువ వడ్డీ విధిస్తాయి. అంతేకాదు.. 3 లక్షల రూపాయల లోన్ వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం SBI.. గోల్డ్​పై 8.70 శాతం వడ్డీతో రుణం అందిస్తోంది.

ఎఫ్​డీ ద్వారా..

తక్కువ వడ్డీకి రుణం పొందడానికి ఉన్న మూడో అవకాశం.. ఎఫ్​డీ (Fixed Deposit​)పై లోన్. మీకు కనుక ఏదైనా బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ ఉంటే.. దానిపై రుణం తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఎఫ్‌డీపై తక్కువ వడ్డీకే లోన్స్ పొందొచ్చు. ఇంకా.. ఈజీగా పొందవచ్చు. మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తంలో గరిష్టంగా 90 నుంచి 95 శాతం వరకు మీరు రుణం తీసుకోవచ్చు. మరో ప్రయోజనమేమిటంటే.. లోన్​పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి.. లోన్ తీసుకోవాల్సి వస్తే.. ఈ ఆప్షన్స్​ను దృష్టిలో పెట్టుకోండి.

Personal loan on Google Pay: మీ ఫోన్‌లో గూగుల్ పే ఉందా.. అయితే, మీకు లక్ష దాకా రుణం వచ్చేసినట్టే..!

Gold Loan Vs Gold Sale : డబ్బు కోసం.. బంగారాన్ని అమ్మాలా? తాకట్టు పెట్టాలా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.