Bank Of Baroda Zero Balance Savings Account : ఈ పండగ సీజన్లో బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యాంక్‌లో 'లైఫ్ టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్'ను ఓపెన్ చేసేందుకు వీలు కల్పించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా పండగ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రకటించింది. ఈ లైట్ సేవింగ్ అకౌంట్‌తో ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించనున్నట్లు వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా.. జీరో సేవింగ్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్‌ను మెయిన్టైన్ చేయాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి లైఫ్‌టైమ్ ఫ్రీ రూపే ప్లాటినం డెబిట్ కార్డ్‌ను జారీ చేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. కాకాపోతే దీనికి త్రైమాసికంలో సగటు బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి. లైట్ సేవింగ్ ఖాతాదారులకు సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండదని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.
బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ఫీచర్లు..
BOB Light Saving Account : 10 ఏళ్లు పైబడిన మైనర్లు కూడా ఈ బ్యాంక్‌లో ఖాతా తెరవచ్చు. ఓ చెక్ బుక్‌ను సైతం ఉచితంగా పొందొచ్చు. దాంతోపాటు అర్హత కలిగిన ఖాతాదారులు.. ఉచితంగా క్రెడిట్ కార్డ్ సదుపాయాన్ని కలిగిస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డును ఉపయోగించి.. ఎలక్ట్రానిక్స్, ఆహారం, ఫ్యాషన్, వినోదం, లైఫ్‌స్టైల్, కిరాణా సామానులు, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కొనుగోళ్లపై డిస్కౌంట్లు, ఆఫర్లు పొందవచ్చని ప్రకటించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌లపై 2023 డిసెంబర్ 31 స్పెషల్ ఆఫర్స్..
BOB Zero Balance Account Benefits : బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకుంది. అందుకే 2023 డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటో సహా, ఇతర సంస్థల్లో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.
RBL Bank Zero Balance Savings Account : RBL సేవింగ్స్ అకౌంట్‌తో.. ఎన్ని ప్రయోజనాలో చూశారా..!