List of Bank Holidays in November 2023 : బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. 2023 నవంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. వచ్చే నెలలో బ్యాంక్ పనుల కోసం తిరిగేవాళ్లు.. ఈ లిస్ట్‌ను కచ్చితంగా చూడాలి. ఫాలో కావాల్సి ఉంది. లేదంటే.. ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడాల్సి రావొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి నెలా.. బ్యాంక్ సెలవుల(Bank Holidays) జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా నవంబర్ నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ సెలవుల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఇంతకీ.. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో.. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2023 నవంబర్ బ్యాంక్ సెలవులు..
November 2023 Bank Holidays :
- నవంబర్ 1 - బుధవారం (కరక చతుర్థి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది.)
- నవంబర్ 5 - ఆదివారం
- నవంబర్ 10 - శుక్రవారం (వంగాల పండుగ సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 11 - రెండో శనివారం
- నవంబర్ 12 - ఆదివారం (దీపావళి కూడా)
- నవంబర్ 13 - సోమవారం, గోవర్ధన్ పూజ (ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, దిల్లీలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 15 - బుధవారం, భాయ్ దూజ్ (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 19 - ఆదివారం
- నవంబర్ 24 - శుక్రవారం, లచిత్ దివాస్ (అస్సాంలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 25 - నాలుగో శనివారం
- నవంబర్ 26 - ఆదివారం
- నవంబర్ 27 - సోమవారం, గురునానక్ పుట్టినరోజు (పంజాబ్, చండీగఢ్‌లో బ్యాంకులకు సెలవు)
ATM Withdraw Issues : ఏటీఎంలో డబ్బులు రాలేదా..? బ్యాంకులు రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే..!
పైన చెప్పిన విధంగా.. కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవులు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో స్థానికంగా కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రతినెలా చివర్లో సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేస్తుంది. అందుకే.. ప్రతినెలా ఈ సెలవులను ముందస్తుగా తెలుసుకొని.. వాటికి అనుగుణంగా మీ షెడ్యూల్ ప్లాన్ చేస్కుంటే.. ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు ఎలా చేయాలి..?
Are Banks Open On Bank Holidays : అయితే.. ఇక్కడో ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ నెలలో ఇన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. బ్యాంకులతో కాకుండా.. వీటి ద్వారా మీరు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.
Banks 2 Weekly Off : బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు!.. మోదీ ప్రభుత్వం దీనిని ఆమోదిస్తుందా?
Home Loans With Low Interest Rates 2023 : తక్కువ వడ్డీకి.. హోమ్ లోన్స్ అందించే బ్యాంకులివే..!