Bank Holidays In January 2024 : బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 జనవరి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2024 జనవరి నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందుకే ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
2024 జనవరి నెలలో బ్యాంక్ సెలవుల జాబితా
List of Bank Holidays In January 2024 :
- జనవరి 1 (సోమవారం) : ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
- జనవరి 11 (గురువారం) : మిషనరీ డే సందర్భంగా మిజోరం రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 12 (శుక్రవారం) : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బంగాల్లోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 13 ( రెండో శనివారం) :
- జనవరి 14 (ఆదివారం) : లోహ్రీ పండుగ సందర్భంగా పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 15 (సోమవారం) : సంక్రాంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 16 (మంగళవారం) : పొంగల్ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 17 (బుధవారం) : తిరువళ్లువర్ డే సందర్భంగా తమిళనాడులో బ్యాంకుల సెలవు.
- జనవరి 23 (మంగళవారం) : తుసు పూజ సందర్భంగా బంగాల్, అసోం రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 25 (గురువారం) : హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ సందర్భంగా ఆ రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు.
- జనవరి 26 (శుక్రవారం) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- జనవరి 27 ( నాల్గో శనివారం) :
- జనవరి 31 (బుధవారం) : మీ-డ్యామ్-మీ-ఫై సందర్భంగా అసోంలోని బ్యాంకులకు సెలవు.
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : జనవరి నెలలో 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా కొనసాగుతాయి. కనుక బ్యాంకులకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.
అత్యవసరంగా రుణం కావాలా? సిబిల్ స్కోర్ లేకున్నా లోన్ పొందండిలా!
దంపతుల కోసం బెస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ - ఏకంగా రూ.5.55 లక్షల వడ్డీ!