ETV Bharat / business

Axis Bank Numberless Credit card launched : నంబర్​ లెస్​ క్రెడిట్​ కార్డ్స్​తో బోలెడు బెనిఫిట్స్​.. హై సెక్యూరిటీ కూడా! - యాక్సిస్​ నంబర్ లెస్​ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్​

Axis Bank Numberless Credit card launched : క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్​ న్యూస్​. భారతదేశంలో నంబర్​ లెస్​ క్రెడిట్ కార్డ్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో క్రెడిట్ కార్డ్ నంబర్​, ఎక్స్​పైరీ డేట్​, సీవీవీ నంబర్ ఉండవు. కనుక మీ ఆర్థిక లావాదేవీలకు చాలా భద్రత చేకూరుతుంది. మరి ఆ క్రెడిట్ కార్డ్ ఎవరు తెచ్చారు? దాని వల్ల ఇంకా ఏమేమి బెనిఫిట్స్ లభించనున్నాయో తెలుసుకుందామా?

numberless credit card Benefits
Axis Bank Numberless Credit card launched
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 4:33 PM IST

Axis Bank Numberless Credit card launched : యాక్సిస్ బ్యాంక్​.. 'ఫైబ్​' అనే సంస్థతో కలిసి దేశంలోనే మొదటిసారిగా నంబర్​ లెస్ క్రెడిట్ కార్డ్​ను ప్రవేశపెట్టింది. అందులో క్రెడిట్ కార్డ్​ నంబర్​, ఎక్స్​పైరీ డేట్​, సీవీవీ నంబర్ ఉండవు. కనుక ఈ నంబర్ లెస్​ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసే ఆర్థిక లావాదేవీలకు అదనపు భద్రత ఉంటుంది.

సెక్యూరిటీ ఫీచర్స్​
Numberless Credit Card Security Features : యాక్సిస్​ బ్యాంక్ ప్రవేశపెట్టిన ఈ నయా ఫిజికల్​​ కార్డులో.. క్రెడిట్​ కార్డ్​ నంబర్​, ఎక్స్​పైరీ డేట్​, సీవీవీ ఉండవు. కనుక యూజర్​ ఐడెంటిటీని ఎవరూ గుర్తించలేరు. అలాగే కార్డ్ వివరాలను కూడా ఎవరూ చోరీ చేయలేరు. కనుక క్రెడిట్​ కార్డ్ మోసాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సింపుల్​గా చెప్పాలంటే.. వినియోగదారుని భద్రత, గోప్యతలకు ఎలాంటి భంగం ఏర్పడదు.

ఎలా ఉపయోగించాలి?
యాక్సిస్ బ్యాంక్ తెచ్చిన ఈ నంబర్ లెస్​​ క్రెడిట్ కార్డ్​ను.. Fibe App ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఈ కో-బ్రాండెడ్​ క్రెడిట్ కార్డ్​.. చాలా ఫీచర్స్, ఆఫర్స్​​ అందిస్తోంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

యాక్సిస్​ క్రెడిట్ కార్డ్​ - ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్​!
Numberless Credit Card Features :

  • ఆన్​లైన్​ ఫుడ్ డెలివెరీపై 3% క్యాష్​బ్యాక్ లభిస్తుంది. దేశంలోని అన్ని రెస్టారెంట్​ల్లోనూ ఈ ఆఫర్​ అందుబాటులో ఉంటుంది.
  • స్థానిక రైడ్​-హెయిలింగ్ యాప్​ ఖర్చులపై 3% క్యాష్​బ్యాక్ లభిస్తుంది. (స్థానికంగా చేసే ప్రయాణాలపై క్యాష్​బ్యాక్​)
  • ఆన్​లైన్​ టికెట్​ బుకింగ్స్​పైన కూడా 3% వరకు క్యాష్​బ్యాక్​ అందుతుంది.
  • అన్ని ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ ట్రాన్సాక్షన్స్​పై 1 శాతం వరకు క్యాష్​బ్యాక్​ లభిస్తుంది.
  • డిజిటల్ లావాదేవీలకు, అలాగే ఫిజికల్​ స్టోర్స్​లో కొనుగోళ్లు చేయడానికి ఈ నంబర్ లెస్​ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవచ్చు.
  • ముఖ్యంగా ఈ కార్డును యూపీఐతో లింక్​ చేసుకోవచ్చు.
  • ట్యాప్​ అండ్​ పే విధానం ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.

ఫీజు ఎంత ఉంటుంది?
Axis Numberless Credit Card Fee :

  • ఈ ఫైబ్​ యాక్సిస్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డుపై ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదు. అలాగే జీవితాంతం ఎలాంటి వార్షిక రుసుము వసూలు చేయరు.
  • ఈ కార్డ్ హోల్డర్లు సంవత్సరానికి 4 సార్లు డొమెస్టిక్ ఎయిర్​పోర్ట్ లాంజ్​లను కాంప్లిమెంటరీగా యాక్సెస్​ చేసుకోవచ్చు. అంటే లాంజ్​లోకి వెళ్లి మినిమం ఛార్జీలతో నచ్చిన ఆహార పదార్థాలను తినవచ్చు.
  • రూ.400 నుంచి రూ.5,000 విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తే.. సర్​ఛార్జీ నుంచి మినహాయింపు పొందవచ్చు.
  • ఈ నంబర్​ లెస్ క్రెడిట్​ కార్డ్​పై.. డైనింగ్, షాపింగ్ ఆఫర్స్, డిస్కౌంట్స్, క్యాష్​బ్యాక్స్​​ కూడా లభిస్తాయి.
  • సీజనల్​ సేల్స్​, రూపే పోర్ట్​ఫోలియో-రిలేటెడ్ ఆఫర్స్ కూడా ఉంటాయి.

Dormant Demat Account : మీ డీమ్యాట్ అకౌంట్​​.. 'ఇన్​యాక్టివ్​'గా మారిందా?.. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్​లైన్ ఫెస్టివల్​ ఆఫర్​లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.