ETV Bharat / business

పాన్​ కార్డు దరఖాస్తు టైమ్​లో ఈ తప్పులు చేస్తున్నారా? ఇక అంతే! - పాన్ కార్డు అప్లై

Avoid These Mistakes While Applying for PAN Card: ప్రస్తుతం ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో.. పాన్ కార్డు సైతం అంతే ముఖ్యం. ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కరికీ ఇది అవసరం. గతంలో పాన్ కార్డు అప్లై చేసుకోవడం, దానిని అందుకోవడానికి చాలా రోజులు పట్టేది. కానీ.. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ఈజీగా పొందవచ్చు. అయితే.. అప్లికేషన్​ టైం లో ఈ తప్పులు చేస్తే.. మీకు పాన్​కార్డ్​ రాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి.

Avoid These Mistakes While Applying for PAN Card

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 12:37 PM IST

Avoid These Mistakes While Applying for PAN Card: ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కరికీ పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. 10 అంకెలు గల పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (Perminent Account Number) కొన్ని లావాదేవీలకు తప్పనిసరి. పాన్ కార్డ్ ప్రాథమికంగా ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం, పన్నులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ గుర్తించడం, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా ఊపయోగిస్తుంటారు. అంతేకాదు .. బ్యాంకు అకౌంట్ ఓపెన్​ చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం, జీతం పొందడం లాంటి పలు రకాల ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలకు ఇది తప్పనిసరి.

పాన్ కార్డ్ లేనివాళ్లు, ఎక్కడైనా పాన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం రాగానే దరఖాస్తు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే కొన్ని వారాలు పట్టేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసి పాన్ కార్డ్ పొందొచ్చు. కొత్త పాన్ కార్డ్ మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న పాన్ కార్డులో ఏవైనా వివరాలు అప్‌డేట్ చేయాలన్నా ఆన్‌లైన్‌లో సాధ్యమే. అయితే పాన్​కార్డు అత్యవసరం ఉన్న వాళ్లు.. అప్లై చేసే సమయంలో తొందరపాటుతో కొన్ని పొరపాట్లు చేస్తారు. దీని వల్ల మీకు రావాల్సిన పాన్​ కార్డు.. లేట్​ అవుతుంది. మరి ఆన్​లైన్​లో పాన్​కార్డుకు ఎలా అప్లై చేయాలి..? అప్లికేషన్​ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పెళ్లి తర్వాత పాన్​కార్డులో ఇంటిపేరు మార్చాలా? - ఫోన్​లోనే ఈజీగా మార్చేయండి!

ఆన్​లైన్​లో పాన్​కార్డుకు అప్లై చేయడం ఎలా..?

How to Apply PAN Card in Online:

  • మొదటగా.. TIN NSDL అధికారిక వెబ్​సైట్​ ఓపెన్​ చేయాలి. తర్వాత Quick Links లో Online PAN Services ఆప్షన్​పై క్లిక్​ చేసి Apply for PAN Online ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​ స్క్రీన్​ మీద ఓపెన్​ అవుతుంది. అందులో అప్లికేషన్​ టైప్​లో New PAN-Indian Citizen సెలెక్ట్​ చేసుకోవాలి. అలాగే కేటగిరి లోకి వెళ్లి Individual ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత పేరు, బర్త్ డేట్, లింగం, అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు ఇవ్వాలి.
  • గుర్తింపు కార్డు, నివాస ధ్రువత్రం, బర్త్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీ అప్​లోడ్ చేయాలి.
  • తర్వాత దరఖాస్తు ఫీజు ఆన్​లైన్​ పద్ధతిలో చెల్లించాలి.
  • అంతా ఓకే అనుకున్న తర్వాత.. సబ్మిట్ చేసి, రిసిప్ట్​ (అక్నాలెడ్జ్ మెంట్) ప్రింట్ తీసుకోవాలి
  • ఆ తర్వాత ప్రింటవుట్‌ తీసుకున్న ఫారమ్​పై రెండు ఫొటోలు అతికించి సంతకం చేయాలి.
  • అప్లికేషన్​ ఫాం, డాక్యుమెంట్లు NSDL అడ్రస్​కు పోస్టల్​ ద్వారా పంపించాలి.
  • అంతే.. మీరు సమర్పించిన ఆడ్రస్​కు వారాల వ్యవధిలో పాన్​ కార్డు వచ్చేస్తుంది.

New Financial Rules From October 1st 2023 : అక్టోబర్ 1 నుంచి మారిన ఫైనాన్సియల్​ రూల్స్.. ప్రజలపై డైరెక్ట్ ఎఫెక్ట్​!.. పూర్తి వివరాలు ఇవే..

అప్లికేషన్​ సమయంలో ఈ తప్పులు చేయకండి:

Do not Make these Mistakes during Application:

  • అప్లికేషన్​ ఫిల్​ చేసే సమయంలో పేర్లను తప్పుగా ఎంటర్​ చేయొద్దు. SSC Memo లో ఉన్న విధంగా పేరు, పుట్టినరోజు వివరాలను ఎంటర్​ చేయండి.
  • తండ్రి పేరు రాయాల్సిన చోట భార్య లేదా భర్త పేరు రాయకూడదు.
  • మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ తప్పులు లేకుండా రాయాలి.
  • అడ్రస్​ ఫిల్​ చేసే ముందు కచ్చితమైన చిరునామాను మాత్రమే ఎంటర్​ చేయాలి.
  • అన్ని వివరాలు ఎంటర్​ చేసి సబ్మిట్​ చేసే ముందు మరొక్కసారి అన్ని వివరాలను పరిశీలించాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​ డౌన్​లోడ్​ చేసుకున్న తర్వాత.. ఫొటోలు అతికించే క్రమంలో.. పాన్ కార్డ్ దరఖాస్తుపై మీ ఫోటోను పిన్ చేయకూడదు. అక్కడ కనిపించే బాక్స్‌లో మాత్రమే అతికించాలి.
  • ఫొటోపైన సంతకం చేయకూడదు. దానికి కేటాయించిన బాక్స్​లో మాత్రమే సంతకం చేయాలి.
  • ఫొటోపైన పెన్ను గీతలు, గుర్తులు ఉంటే మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశముంది.
  • ఇప్పటికే మీ దగ్గర పాన్ కార్డు ఉంటే మరో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధం.
  • అయితే అదే నెంబర్‌తో కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు. పాన్ కార్డులో వివరాలను మార్చుకోవచ్చు.

How to Get Duplicate PAN Card : పాన్‌ కార్డ్‌ పోయిందా ? సింపుల్​గా ఇలా తీసుకోండి!

E Pan Download Online : మీ పాన్ కార్డ్​ మిస్ అయ్యిందా?.. ఆన్​లైన్​లో డౌన్​లోడ్​ చేసుకోండిలా..!

How to Check Pan Aadhaar Link Status : లాస్ట్ డేట్ ముగిసిపోయింది.. మీ పాన్-ఆధార్ లింక్ అయ్యిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.