ETV Bharat / business

Apple Subscribers Count : 100 కోట్లు దాటిన యాపిల్​ పెయిడ్​ సబ్​స్క్రిప్షన్స్​.. గత 12 నెలల్లోనే కొత్తగా 15 కోట్లు - యాపిల్​ సీఈఓ టిమ్ కుక్​ వార్తలు

Overall Apple Subscribers Count : ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ యాపిల్​ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తాము అందిస్తున్న అన్ని సర్వీసులకు కలిపి 100 కోట్లకు పైగా పెయిడ్​ సబ్​స్క్రైబర్లను సంపాదించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. గత 12 నెలల్లో ఏకంగా 15 కోట్ల మంది నూతన సబ్​స్క్రైబర్లు ఈ జాబితాలో చేరారని తెలిపింది.

Apple surpasses 1 billion or 100 crores paid subscriptions across its services
100 కోట్లు దాటిన యాపిల్​ పెయిడ్​ సబ్​స్క్రిప్షన్స్​.. గత 12 నెలల్లో 15కోట్ల మంది చేరిక..
author img

By

Published : Aug 4, 2023, 7:14 PM IST

Updated : Aug 4, 2023, 7:39 PM IST

Overall Apple Subscribers Count : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్​ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా తాము అందిస్తున్న అన్ని సేవలకు కలిపి 100 కోట్ల(1 బిలియన్​)కు పైగా పెయిడ్​ సబ్​స్క్రిప్షన్​లను సాధించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. గత 12 నెలల్లో ఏకంగా 15 కోట్ల (150 మిలియన్​) మంది కొత్త సబ్​స్క్రైబర్లు ఈ జాబితాలో చేరారని తెలిపింది. కేవలం మూడు సంవత్సరాల్లోనే తమ సబ్​స్క్రైబర్ల సంఖ్య రెట్టింపు అయిందని యాపిల్ చెప్పింది. కాగా, 2020లో ఈ సంఖ్య 500 కోట్లుగా ఉంది.

Apple Company Overall Subscribers : ప్రపంచవ్యాప్తంగా యాపిల్​ యాక్టివ్​ యూజర్స్​ అత్యంత వేగంగా పెరుగుతన్నారని.. ఇది భవిష్యత్​లో తమ సంస్థ తయారు చేసే ఎకోసిస్టమ్​ ప్రోడక్ట్​ మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని ఐఫోన్​ కంపెనీ తెలిపింది. కాగా, ప్రస్తుతానికి యాపిల్​కు 2 బిలియన్​(200 కోట్లు)కుపైగా యాక్టివ్​ యూజర్స్​ ఉన్నారు. అయితే 1 బిలియన్​ పెయిడ్​ సబ్​స్క్రిప్షన్స్​తో తమ కంపెనీ ఆల్​-టైమ్​-హై రికార్డు ఆదాయాన్ని ఆర్జించిందని.. ఇది తాము అందించిన మెరుగైన సేవలతోనే సాధ్యమైందని యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ అన్నారు.

"మా సేవల కారణంగా పెరిగిన పెయిడ్​ సబ్​స్క్రిప్షన్స్​ను​ మేము చూస్తున్నాము. మా లావాదేవీలు, చెల్లింపులు రెండూ కూడా ప్రతి ఏడు మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ వస్తున్నాయి. ప్రతిదీ ఆల్-టైమ్​-హైగా నిలుస్తున్నాయి. ఈ మా పెయిడ్​ సబ్​స్క్రిప్షన్స్ సంస్థ బలమైన వృద్ధిని తెలియజేస్తున్నాయి."

- లుకా మాస్త్రీ, యాపిల్​ సీఎఫ్​ఓ

'యాపిల్​ ఆర్కేడ్‌లో 20 కొత్త గేమ్‌ల నుంచి యాపిల్​ టీవీ ప్లస్​లో సరికొత్త కంటెంట్ వరకు మేము అందిస్తున్న ప్రతిదీ మా వినియోగదారులు ఆదరిస్తున్నారు. అందుకే యాపిల్​ కార్డ్​ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో సబ్​స్క్రిప్షన్స్​ నమోదయ్యాయి' అని లుకా మాస్త్రీ చెప్పారు.

వచ్చే ఏడాదే 'యాపిల్​ విజన్​ ప్రో'..
Apple Vision Pro Release Date : సాంకేతికత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని టిమ్​ కుక్​ అన్నారు. ఇందులో భాగంగానే ఎవరూ తయారు చేయని 'యాపిల్​ విజన్​ ప్రో' ప్రోడక్ట్​ను లాంఛ్​ చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదే దీన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన​ స్పష్టం చేశారు. ఇది దశాబ్దాల పరిశోధనల ఫలితం అని.. దీనిని తయారు చేయడం కేవలం యాపిల్​తోనే సాధ్యమైందని, ఈ డివైజ్​ ఇంజినీరింగ్​లోనే ఒక గొప్ప అద్భుతం అని యాపిల్​ సీఈఓ వివరించారు. లాంఛ్​కు ముందే ఈ డివైజ్​ను అందరూ కొనియాడుతున్నారని టిమ్​ కుక్​ తెలిపారు.

Last Updated : Aug 4, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.