ETV Bharat / business

యాపిల్ ఆల్​టైమ్​ రికార్డ్.. 3 ట్రిలియన్ డాలర్లకు మార్కెట్​ విలువ! - యాపిల్ మార్కెట్ క్యాప్

Apple market value 3 trillion : ప్రపంచంలోనే తొలిసారి 3 ట్రిలియన్​ డాలర్ల విలువతో ట్రేడింగ్ డేను ముగించిన పబ్లిక్ కంపెనీగా యాపిల్ నిలిచింది. శుక్రవారం యాపిల్ షేర్లు 2.3శాతం పెరిగాయి.

apple 3 trillion market cap
యాపిల్ ఆల్​టైమ్​ రికార్డ్.. 3 ట్రిలియన్ డాలర్లకు మార్కెట్​ విలువ!
author img

By

Published : Jul 1, 2023, 6:57 AM IST

Updated : Jul 1, 2023, 7:51 AM IST

Apple 3 trillion market cap : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌.. మరో ఘనతను సాధించింది. 3 ట్రిలియన్ డాలర్ల విలువతో ట్రేడింగ్‌ డేను ముగించిన తొలి పబ్లిక్ కంపెనీగా యాపిల్‌ అవతరించింది. శుక్రవారం యాపిల్‌ షేర్లు 2.3 శాతం పెరగగా.. ఆ సంస్థ మార్కెట్ విలువ 3.04 ట్రిలియన్ల డాలర్లకు చేరింది.

Apple market value 3 trillion : 2022 జనవరిలోనూ.. వరసగా రెండు రోజులు యాపిల్‌ సంస్థ 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్ ముగిసే సరికి ఆ విలువను కొనసాగించలేకపోయింది. టెక్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ 2.53 ట్రిలియన్లతో రెండో అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా ఉంది. చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో 2.08 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ విలువతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

యాపిల్​ 47 ఏళ్ల ప్రస్థానం..

  • యాపిల్​ సంస్థను 1976 ఏప్రిల్ 1న స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్, రొనాల్డ్ వేన్ కలిసి స్థాపించారు. 3 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరేందుకు ఆ సంస్థకు 47 సంవత్సరాలు పట్టింది.
  • 1985లో యాపిల్​కు స్టీవ్ జాబ్స్ దూరం కావాల్సి వచ్చింది. అయితే.. 1997 నాటికి ఆ సంస్థ దివాలా అంచున ఉండగా.. స్టీవ్ జాబ్స్ తిరిగొచ్చారు. ఆ తర్వాత యాపిల్ వృద్ధి బాటలో పరుగులు తీసింది.
  • 2021 ఆగస్టులో తొలిసారి యాపిల్ 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే 3 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.
  • యాపిల్ ఆదాయంలో సింహభాగం ఐఫోన్ ద్వారా వస్తోంది. గతేడాది ఆ సంస్థ సేల్స్ విభాగంలో 400 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించగా.. అందులో సగానికిపైగా ఐఫోన్ల విక్రయం ద్వారా వచ్చిందే కావడం విశేషం.
  • మదుపర్లకు ఏడాదికి 105 బిలియన్ డాలర్ల డివిడెండ్ చెల్లించి, షేర్లను తిరిగి కొనేసినా.. గత త్రైమాసికంలో 56 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు యాపిల్ దగ్గర ఉన్నాయి.
  • జిల్లో సంస్థ అంచనాల ప్రకారం 3 ట్రిలియన్ డాలర్లతో... అమెరికాలో దాదాపు 90 లక్షల ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. అమెరికన్లు అందరికీ... 3 ట్రిలియన్ డాలర్లను సమానంగా పంచితే ఒక్కొక్కరికీ 9 వేల డాలర్లు అందుతాయి.

Last Updated : Jul 1, 2023, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.