అమెజాన్ రిటైల్ సీఈఓ డేవ్ క్లార్క్ తన పదవికి రాజీనామా చేశారు. 23ఏళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల వ్యాపార ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) డేవ్ క్లార్క్ సంస్థను వీడుతున్నట్లు అమెజాన్ తాజాగా ప్రకటించింది. అమెజాన్‌లో సరఫరా గోలుసులో వేగవంతం, వ్యాపార విస్తరణలో క్లార్క్ కీలక పాత్ర పోషించారు.
"23 ఏళ్ల తర్వాత డేవ్ క్లార్క్ సంస్థను వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన చివరి పనిదినం జులై 1తో ముగియనుంది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈఓ)కి దరఖాస్తు చేసింది. ఇతర అవకాశాలను అందుకునేందుకే క్లార్క్ రాజీనామా చేశారు. ఆయన సంస్థలోని పలు బృందాలకు నాయకత్వం వహించారు. అమెజాన్ రవాణా నెట్‌వర్క్‌ను నిర్మించారు. సంస్థలోని అన్ని రంగాల్లో నైపుణ్యతను పెంపొందించారు."
- ఆండీ జాస్సీ, అమెజాన్ సీఈఓ.
డేవ్ క్లార్క్ తన ఎంబీఏ డిగ్రీ పూర్తయిన మరుసటి రోజునే 1999, మేలో అమెజాన్ అమెజాన్ ఆపరేషన్స్ పాత్‌వేస్ ప్రోగ్రామ్‌లో చేరారు. '23 ఏళ్ల క్రితం నేను చేరినప్పుడు సంస్థ కేవంల ఆరు సెంటర్లతో చిన్నగా ఉండేది. కానీ, చాలా వేగంగా అభివృద్ధి చెందింది. నేను సీటెల్‌కు వచ్చినప్పుడు కలుసుకున్న వ్యక్తుల ద్వారా అమెజాన్‌లో అవకాశం వచ్చింది. ' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 40+ ఏజ్‌లోనే రిటైర్ కావాలా? అయితే 'ఫైర్' అవ్వాల్సిందే!