Amazon Prime Day Sale 2023 : షాపింగ్ ప్రియులకు వెరీ గుడ్ న్యూస్. అమెజాన్ ప్రైమ్ డే సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ రెండూ శనివారమే ప్రారంభం అయ్యాయి. సెల్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, టీవీలు, ఫ్యాషన్ వస్తువులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ నడుస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ ఏమిటో ఓ లుక్కేద్దామా?
Amazon Prime Day Sale 2023 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 15, 16.. ఈ రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలైన స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపయోగ వస్తువులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆర్డర్ చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే డెలివరీ కూడా చేస్తామని అమెజాన్ స్పష్టం చేసింది.
Amazon Prime Day Phone Deals : ముఖ్యంగా ఈ ప్రైమ్ డే సేల్‌లో ఐఫోన్ 14 అన్ని ఆఫర్లతో కలిపి కేవలం రూ.65,999కే అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ బ్రాండెడ్ ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి చేసిన పేమెంట్స్‌పై 10 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. శనివారం ఐఫోన్ 14 సహా టాప్ బ్రాండ్ ఫోన్లు సేల్‌లో ఉంటాయి. ఆదివారం ఐకూ నియో 7 ప్రో 5జీ, వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ, రియల్మీ నార్జో 60 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్లు సేల్కు రానున్నాయి.
Amazon prime membership plans : వాస్తవానికి ఈ ప్రైమ్ డే సేల్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే. ఒక వేళ మీరు ఈ గ్రాండ్ సేల్‌లో బెస్ట్ ఆఫర్స్ పొందాలంటే, అమెజాన్ ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్ కేవలం రూ.299కే అమెజాన్ ప్రైమ్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. రూ.599కి 3 నెలల సబ్స్క్రిప్షన్, రూ.1499కి ఏడాది సబ్స్క్రిప్షన్ ఇస్తోంది. అంతే కాదు మొదటిసారిగా అమెజాన్ ప్రైమ్ వాడుతున్నవారికి ఒక నెలపాటు ఉచిత ట్రయల్‌ను కూడా అందిస్తోంది.
Flipkart big saving days 2023 :
వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ జులై 15 నుంచి జులై 19 వరకు బిగ్ సేవింగ్ డేస్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
Flipkart big saving days Discounts and Offers : టీవీ అండ్ అప్లయన్సెస్‌పై 75 శాతం వరకు, ఫర్నీచర్‌పై 80 శాతం వరకు, రిఫ్రిజిరేటర్లపై 60 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఫ్యాషన్ దుస్తులు, వస్తువులపై 50% నుంచి 80% వరకు భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. ఇవే కాదు ఇంకా అనేక కేటగిరీల వస్తువులపై భారీగా బ్యాంకు డిస్కౌంట్లు, ఆఫర్లు, డీల్స్ కూడా ఇస్తోంది.
Flipkart big saving days Bank offers : ఈ ఫ్లిప్‌కార్డ్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి షాపింగ్ చేస్తే, అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Flipkart Plus membership offers : వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రైబర్లకు జులై 14 నుంచే ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. మిగతావాళ్లకు ఈ రోజు నుంచి జులై 19 వరకు సేల్ నడుస్తుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్స్
Flipkart exchange offers : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో వస్తువులను కొనడం మాత్రమే కాదు. మన దగ్గర ఉన్న పాత ఫోన్లు కూడా అమ్మడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓల్డ్ ఫోన్ సేల్ ద్వారా గరిష్ఠంగా రూ.40,000 వరకు పొందడానికి అవకాశం ఉంది.
క్లియరెన్స్ సేల్
Flipkart clearance sale : ఫ్లిప్‌కార్ట్ పనిలోపనిగా ఏసీ క్లియరెన్స్ సేల్ కూడా నిర్వహిస్తోంది. దీనిలో ఏసీ ధరలు భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.