ETV Bharat / business

అమెజాన్‌ బిగ్​ షాక్.. 10 కాదు 20 వేల మంది ఉద్యోగులు తొలగింపు! - అమెజాన్‌లో 20 వేల మంది తొలగింపు

అమెరికాకు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 10వేల మందిని తొలగించాలని ఆ కంపెనీ భావిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. ఆ సంఖ్య 20 వేల వరకు ఉండనుందని తాజాగా తెలిసింది.

amazon
అమెజాన్‌
author img

By

Published : Dec 5, 2022, 5:21 PM IST

Updated : Dec 5, 2022, 5:40 PM IST

amazon job cuts 2022: అమెరికాకు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 10వేల మందిని తొలగించాలని ఆ కంపెనీ భావిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. ఆ సంఖ్య 20 వేల వరకు ఉండనుందని తాజాగా తెలిసింది. కరోనా సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న ఆ సంస్థ.. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పుడు ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. అన్ని గ్రేడ్లు, అన్ని ర్యాంకుల ఉద్యోగులపైనా ఈ ప్రభావం ఉండబోతోంది అని ‘కంప్యూటర్‌ వరల్డ్‌’ అనే వెబ్‌సైట్‌ రాసుకొచ్చింది.

పనితీరు సరిగా లేని ఉద్యోగులను గుర్తించాలని మేనేజర్లకు అమెజాన్‌ ఇప్పటికే సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ విధంగా మొత్తం 20 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్‌ సిద్ధమైనట్లు కంప్యూటర్‌ వరల్డ్‌ పేర్కొంది. అమెజాన్‌ మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య 1.3 శాతంతో సమానం. ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులకు 24 గంటల ముందు నోటీసు అందించడంతో పాటు పరిహార ప్యాకేజీ ఇవ్వనున్నారు. ఒకవేళ 20 వేలమందినీ తొలగిస్తే అమెజాన్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద తొలగింపు కానుంది.

"కరోనా సమయంలో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగుల్ని నియమించుకున్నాం. ఇప్పుడు కంపెనీ వ్యాపార పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఫలానా విభాగం, ఫలానా ప్రాంతం అని కాకుండా అన్ని చోట్లా ఉద్యోగుల తొలగింపు ఉండబోతోంది" అని అమెజాన్‌ సీఈఓ ఆండీ జాస్సీ ఉద్యోగులకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు ‘కంప్యూటర్‌ వరల్డ్‌’కు తెలియజేశాయి. అయితే, ఎంతమందిని అనేది అందులో పేర్కోనప్పటికీ.. ఆ సంఖ్య 20 వేల వరకు ఉండొచ్చని తెలిపింది.

Last Updated : Dec 5, 2022, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.