ETV Bharat / business

భారత్​ నుంచి అలీబాబా నిష్క్రమణ.. మొత్తం షేర్లు పేటీఎంకు విక్రయం - One​97 Communications​ Limited

చైనాకు చెందిన అలీబాబా కంపెనీ భారత్​ నుంచి పూర్తిగా వైదొలగనుంది. తనకున్న షేర్లను పేటీఎం మాతృసంస్థ అయిన వన్​97 కమ్యూనికేషన్స్​ లిమిటెడ్​కు విక్రయించింది. శుక్రవారం ఈ డీల్​ జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Alibaba exits India
Alibaba exits India
author img

By

Published : Feb 10, 2023, 5:43 PM IST

చైనా మల్టీనేషనల్​ కంపెనీ అయినా అలీబాబా.. భారత్​ నుంచి పూర్తిగా వైదొలగింది. సంస్థకున్న మొత్తం షేర్లను పేటీఎం మాతృసంస్థ అయిన వన్​97 కమ్యూనికేషన్స్​ లిమిటెడ్​కు అమ్మినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం జరిగిన డీల్​తో ఈ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించాయి. అలీబాబాకు చెందిన 3.16 శాతం డైరెక్ట్‌ వాటాను బ్లాక్‌ డీల్‌లో దాదాపు 13,600 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలిపాయి.

డిసెంబర్ 2022 నాటికి అలీబాబా కంపెనీ పేటీఎమ్​లో 6.26 శాతం ప్రత్యక్ష వాటాలను కలిగి ఉంది. అందులో జనవరిలో 3.1 శాతం వాటాను విక్రయించగా మిగిలిన 3.16 శాతం శుక్రవారం విక్రయించింది. ఈ డీల్​తో అలీబాబా కంపెనీ పూర్తిగా భారత్ నుంచి తరలివెళ్లనుంది. గతంలో కూడా జొమాటో, బిగ్‌బాస్కెట్‌లో తన వాటాలను అలీబాబా కంపెనీ విక్రయించింది.
గత కొద్ది రోజులుగా పేటీఎం​ షేర్ల విలువ పెరుగుతూ వస్తోంది. రుణాలు, ఇతర కీలక చెల్లింపుల్లో వృద్ధిని కొనసాగిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.