ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాస్త పెరిగినా.. యాడ్ ఆన్స్ తీసుకుంటేనే పూర్తి భరోసా! - అనుబంధ ఆరోగ్య పాలసీలు

Add On Insurance Policy : సాదారణంగా మనం తీసుకునే ప్రాథమిక పాలసీల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ దానితో పాటు ఐచ్ఛికంగా ఎంచుకోవాల్సిన కొన్ని ప్రత్యేక పాలసీలు ఉంటాయని తక్కువ మందికి తెలిసి ఉంటుంది. వాటినే అనుబంధ పాలసీలు (యాడ్‌-ఆన్‌) అంటారు. ఇప్పుడు కొన్ని ప్రధాన అనుబంధ పాలసీలు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

add-on-insurance-policy-and-coverages-benfits-of-add-on-insurance-policy
అనుబంధ ఆరోగ్య బీమా పాలసీలు
author img

By

Published : Jun 12, 2023, 2:44 PM IST

Add On Insurance Coverage : అనుకోకుండా హాస్పిటల్​లో చేరినప్పుడు, ఆర్థికంగా ఆదుకునే బీమా ఉంటే పెద్ద ఊరట లభిస్తుంది. చాలామంది హెల్త్​ ఇన్స్​రెన్స్​ పాలసీని తీసుకునే సమయంలో తక్కువ ప్రీమియం గురించే ఆలోచిస్తుంటారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా బీమా పాలసీ ఉండాలి. సమగ్ర ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో దాని ప్రయోజనాలు పరిమితంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటప్పుడే అనుబంధ పాలసీలు మనకు ఉపయోగకరంగా ఉంటాయి.

హెల్త్​ ఇన్స్​రెన్స్​​ పాలసీని ఎంచుకునే సమయంలో బీమా మొత్తం కీలకమైన అంశం. దీనికి అవసరమైన యాడ్‌ ఆన్‌లు, రైడర్లనూ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు బీమా సంస్థలు.. ఇప్పుడు సమగ్ర హెల్త్​ ఇన్స్​రెన్స్ పాలసీకి అదనపు భద్రతను అందిస్తున్నాయి.

ప్రైమరీ హెల్త్​ ఇన్స్​రెన్స్ పాలసీతో పాటు ఐచ్ఛికంగా ఎంచుకోవాల్సిన కొన్ని ప్రత్యేక పాలసీలను అనుబంధ పాలసీలు (యాడ్‌-ఆన్‌) అంటారు. ఇన్సూ​రెన్స్ తీసుకున్న వ్యక్తికి కొన్ని అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పాలసీలు ఉపయోగపడతాయి. కొంత ప్రీమియాన్ని అదనంగా వీటికోసం చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్​, ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలున్న వారెవరైనా ఈ అనుబంధ పాలసీ కవరేజీలను తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. అనుబంధాలు లేదా రైడర్లకు వసూలు చేసే ప్రీమియం.. ప్రామాణిక పాలసీలో 30 శాతానికి మించి ఉండకూడదు.

ఇప్పుడు కొన్ని ప్రధాన అనుబంధ పాలసీలను గురించి తెలుసుకుందాం..
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌..
Critical Illness Policy Coverage : సాధారణంగా అన్ని రకాల చికిత్సలకూ ఆరోగ్య బీమా పాలసీలు పరిహారం అందిస్తాయి. అలాంటి సందర్భంలో ప్రత్యేకంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ ఎందుకనే ప్రశ్న వస్తుంది. ప్రామాణిక పాలసీలు కేవలం వైద్య ఖర్చులే భరిస్తాయి. తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బును అందించవు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ తీసుకున్నప్పుడు పాలసీదారుడికి ఏదైనా తీవ్ర అనారోగ్యాన్ని గుర్తిస్తే.. వెంటనే పాలసీ విలువ మేరకు పరిహారాన్ని బీమా సంస్థ అందిస్తుంది. పాలసీలో పేర్కొన్న వ్యాధుల బారిన పడినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.

వ్యక్తిగత ప్రమాద బీమా..
Personal Accident Insurance Policy : ప్రమాదాలకు ఎలాంటి వేచి ఉండే సమయం లేకుండానే హెల్త్​ ఇన్సూ​రెన్స్​లో రక్షణ లభిస్తుంది. హాస్పిటల్​లో చేరినప్పుడైన ఖర్చులు మాత్రమే హెల్త్​ ఇన్సూరెన్స్​ పరిధిలోకి వస్తాయి. పాలసీదారుడు పాక్షిక లేదంటే శాశ్వత వైకల్యం పొందినప్పుడు.. అతనికి ఆర్థిక భద్రత లభించదు. ఇలాంటి సమయాల్లోనే వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్‌ తోడ్పడుతుంది. దురదృష్టవశాత్తూ మరణిస్తే.. నామినీకి ఆ పాలసీ విలువ మొత్తం లభిస్తుంది.

రోజు ఖర్చుల కోసం..
Cash Cover Insurance Policy : పాలసీదారుడు హాస్పిటల్​లో చేరిన రోజు నుంచే ఖర్చుల కోసం నగదును చెల్లించేలా ఆసుపత్రి క్యాష్‌ కవర్‌ పాలసీని తీసుకోవచ్చు. బీమా చేసిన వ్యక్తి కనీసం 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉంటేనే.. ఈ ప్రయోజనాన్ని పొందుతాడు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వరుసగా పద్నాలుగు రోజుల పాటు, పాలసీ ఏడాదిలో గరిష్ఠంగా 30 రోజుల వరకు.. రోజుకు వెయ్యి రూపాయల చొప్పున పరిహారం లభిస్తుంది.

ప్రసూతి సమయంలో..
Family Floater Health Insurance Policy : కొన్ని హెల్త్​ ఇన్సూరెన్స్​ సంస్థలు ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో ప్రసూతి ఖర్చులను కూడా చెల్లిస్తున్నాయి. ప్రసవానికి సంబంధించిన అన్ని ఖర్చులు, నవజాత శిశువుకు ఏదైనా ఇబ్బంది కలిగితే.. అయ్యే చికిత్స ఖర్చులు వంటివి బీమా సంస్థలు చెల్లిస్తాయి. ఇందుకోసం మెటర్నటీ కవర్‌ను తీసుకోవాలి. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కొన్ని పాలసీలు వేచి ఉండే వ్యవధి నిబంధనను విధిస్తాయి.

టాపప్‌ చేసుకోవచ్చు..
Top Up Insurance Plans : ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పాలసీ పరిమితి పూర్తయిన సమయంలో అదనపు మొత్తాన్ని చెల్లించేలా టాపప్‌ పాలసీని సైతం తీసుకోవచ్చు. బీమా మొత్తాన్ని పెంచుకునేందుకు టాపప్‌ పాలసీ ఉపయోగపడుతుంది. దీనికి ప్రీమియం కాస్త తక్కువగానే ఉంటుంది.

ఓపీడీ చికిత్సలకూ..
OPD Insurance Policy : ఔట్‌ పేషెంట్‌ సంప్రదింపులను హెల్త్​ ఇన్సూ​రెన్స్​ పాలసీలు కవర్‌ చేయవు. కేవలం నిర్ణీత చికిత్సకే ఇవి డే కేర్‌ ప్రయోజనాన్ని అందిస్తాయి. దీంతో వైద్య ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇలాంటి సమయాల్లో వైద్యుల కన్సల్టేషన్‌ ఫీజు, వైద్య పరీక్షల వ్యయాలు, మందుల వంటి వాటికీ పరిహారం ఇచ్చేలా.. ఓపీడీ కేర్‌ అనుబంధ పాలసీని తీసుకోవచ్చు.

అనుబంధ పాలసీలను ఎంచుకునే సమయంలో మొదటగా మీ అవసరాలేమిటో గుర్తించండి. అన్ని పాలసీలనూ జోడించుకునే ప్రయత్నం మంచిది కాదనే చెప్పాలి. ఇది ఆర్థికంగా భారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి, పూర్తి అవగాహనతో సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.