ETV Bharat / business

అదానీకి మరో దెబ్బ.. భారీగా తగ్గిన APSEZ​ లాభాలు.. స్టాక్ మార్కెట్లో కాస్త ఊరట! - అదానీ గ్రూప్ న్యూస్

అదానీ గ్రూప్​నకు సంబంధించిన అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్​ ఎనర్జీ సంస్థలు మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఈ ఫలితాల్లో పోర్ట్స్​ నికర లాభం క్షీణించగా.. ఎనర్జీస్ రెండు రెట్లు లాభాన్ని గడించింది. మరోవైపు నష్టాల్లో ఉన్న అనేక అదానీ గ్రూప్​ షేర్లు లాభాల బాట పట్టాయి.

adani latest news
adani latest news
author img

By

Published : Feb 7, 2023, 5:50 PM IST

Updated : Feb 7, 2023, 6:21 PM IST

అదానీ గ్రూప్​ అవకతవకలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో అదానీ పోర్ట్, అదానీ గ్రీన్​ ఎనర్జీ మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించాయి. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(APSEZ)​ నికర లాభం 12 శాతం క్షీణించింది. డిసెంబర్​ 2022 వరకు ముగిసిన Q3లో రూ. 1,336 కోట్ల లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే సమయంలో సుమారు రూ. 1,535 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మూడో త్రైమాసికంలో అదానీ పోర్ట్స్​ రూ. 5,051 కోట్లు అర్జించగా.. రూ. 3,507 కోట్లను వెచ్చించింది. గతేడాది ఇదే సమయంలో రూ.4,713 లాభం రాగా.. రూ. 2,924 కోట్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 14,500- 15,000 కోట్ల ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.

రెండు రెట్లు లాభం గడించిన అదానీ ఎనర్జీ
అదానీ గ్రీన్​ ఎనర్జీ మంగళవారం మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో రెండు రెట్లు లాభాన్ని గడించింది. గతేడాది ఇదే సమయానికి రూ. 49 కోట్ల లాభం రాగా.. ఈసారి రూ. 103 కోట్ల లాభాన్ని పొందింది. అదానీ ఎనర్జీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 2,258 కోట్ల ఆదాయాన్ని అర్జించగా.. గతేడాది Q3లో రూ. 1,471 కోట్ల ఆదాయాన్ని సాధించింది.

లాభాల్లో అదానీ షేర్లు
కొన్ని రోజులుగా నష్టాల్లో ట్రేడవుతున్న అదానీ గ్రూప్​నకు సంబంధించిన అనేక సంస్థలు మంగళవారం దేశీయ స్టాక్​ మార్కెట్లలో లాభాలను గడించాయి. అదానీ ఎంటర్​ప్రైజెస్​ 14 శాతం, అదానీ ట్రాన్స్​మిషన్​ 5 శాతం లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్​ 5 శాతం, అదానీ గ్రీన్​ ఎనర్జీ 3 శాతం, అదానీ విలిమర్ 5 శాతం, ఎసీసీ 3 శాతం, అంబుజా సిమెంట్స్ 3.20 శాతం లాభాన్ని నమోదు చేశాయి. మరోవైపు మార్కెట్​లో లిస్ట్ అయిన 10 కంపెనీల్లో అదానీ టోటల్ గ్యాస్​ 5 శాతం, అదానీ పవర్​ 2.93 శాతం నష్టపోయాయి.

నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు
లోహ, ఆటో, ఎఫ్​ఎమ్​సీజీ షేర్ల అమ్మకాలకు మదుపరులు ఆసక్తి చూపడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​.. 220 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఒకానొక దశలో 60,655 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్​.. 60,286 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ సైతం 40 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. 17,811- 17,652 పాయింట్ల మధ్య కదలాడిన నిఫ్టీ.. 17,721 వద్ద స్థిరపడింది. ఐటీసీ, సన్ ఫార్మా, మారుతీ, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, హెచ్​సీఎల్​ టెక్​, విప్రో, ఇన్ఫోసిస్​, హెచ్​యూఎల్, భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కొటాక్ బ్యాంక్, ఇండస్​ఇండ్​ బ్యాంక్, బజాజ్​ ఫైనాన్స్​, బాజాజ్​ ఫిన్​సర్వ్​, ఎల్​ అండ్​ టీ, ఎస్​బీఐ, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి : 'భారత ఇంధన రంగంలో అపార అవకాశాలు.. గ్యాస్ గిరాకీ 500 శాతం అధికం!'

అదానీ గ్రూప్​ మార్కెట్ విలువ సగానికి పతనం​.. గడువుకు ముందే రుణాలు చెల్లించాలని ​నిర్ణయం

Last Updated : Feb 7, 2023, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.