ETV Bharat / business

Adani Mauritius Investment : 'హిండెన్​బర్గ్ 2.0'.. అదానీ గ్రూప్​పై మరోసారి సంచలన ఆరోపణలు - అదానీ హిండెన్​బర్గ్ వివాదం

Adani Mauritius Investment : అదానీ గ్రూప్​పై మరోసారి ఆరోపణలు వెలువెత్తాయి. మారిషస్​కు చెందిన కంపెనీలు పారదర్శకతకు పాతరేస్తూ.. భారీగా నిధులను అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడులు పెట్టాయని ఓ నివేదికలో తేలింది. అదానీ సన్నిహితులే ఇందులో భాగమయ్యారని పేర్కొంది.

Adani Mauritius Investment
Adani Mauritius Investment
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 9:35 AM IST

Updated : Aug 31, 2023, 10:27 AM IST

Adani Mauritius Investment : అదానీ గ్రూప్​లో పెట్టుబడులపై మరోసారి ఆరోపణలు గుప్పుమన్నాయి. మారిషస్​కు చెందిన కంపెనీలు పారదర్శకతకు పాతరేస్తూ.. భారీగా నిధులను అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడులు పెట్టాయని ఓ నివేదికలో వెల్లడైంది. మారిషస్​ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్స్​ను అదానీ కుటుంబ సభ్యులే నడిపించారని పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్​పీ) అనే సంస్థ ఈ ఆరోపణలు చేసింది.

పన్ను శాతం తక్కువగా ఉన్న దేశాల్లోని పలు ఫైల్స్​తో పాటు అదానీ గ్రూప్ ఈమెయిళ్లను పరిశీలించి ఈ నివేదిక రూపొందించినట్లు ఓసీసీఆర్​పీ తెలిపింది. 'రహస్య ఇన్వెస్టర్లు' ఆఫ్​షోర్ వ్యవస్థల ద్వారా అదానీ షేర్ల కొనుగోలు అమ్మకాలు చేసిన ఉదంతాలు కనీసం రెండు బయటపడ్డాయని వివరించింది. నాసర్ అలీ షాబాన్ అలీ, చాంగ్ చుంగ్-లింగ్ అనే ఇద్దరు వ్యక్తులు.. ఆఫ్​షోర్ వ్యవస్థల ద్వారా ఎన్నో ఏళ్లుగా అదానీ షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు చేపట్టారని వెల్లడించింది. వీరిద్దరికీ అదానీ కుటుంబ వ్యాపారాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కంపెనీలతో పాటు అదానీ గ్రూప్ కంపెనీలలో వీరికి షేర్లు ఉన్నాయని స్పష్టం చేసింది. కొన్ని కంపెనీలలో వీరు డైరెక్టర్లుగానూ పని చేశారని తెలిపింది.

చట్టాలను ఉల్లంఘించారు!
'అలీ, చాంగ్​ ఇద్దరూ ఆదానీ ప్రమోటర్ల తరపున పనిచేస్తున్నారు. అంటే, చట్టం అనుమతించిన 75 శాతం కంటే.. ఆదానీ గ్రూప్​లో అధికంగా అంతర్గత వ్యక్తులు పనిచేస్తున్నారు. ఇది కచ్చితంగా భారతీయ లిస్టింగ్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది' అని ఓసీసీఆర్​పీ తన నివేదికలో పేర్కొంది. 'వాస్తవానికి చాంగ్​, అలీలు పెట్టిన పెట్టుబడులు.. ఆదానీ కుటుంబం ఇచ్చిన డబ్బులతో చేసినవి అని చెప్పడానికి ఎలాంటి అధారాలు లేవు. కానీ కచ్చితంగా ఆదానీ కుటుంబంతో సమన్వయం చేసుకుని మాత్రమే ఈ వ్యవహారం నడిచింది అని చెప్పడానికి కచ్చితమైన ఆధారం ఉంది' అని ఓసీసీఆర్​పీ తెలిపింది.

ఊహించనంత వేగంగా..
'మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2013 సెప్టెంబర్​ నాటికి అదానీ గ్రూప్​ ఆస్తుల విలువ సుమారుగా రూ.8 బిలియన్​ డాలర్లు ఉండేది. కానీ గతేడాది అదానీ గ్రూప్ మార్కెట్​ క్యాపిటలైజేషన్ ఏకంగా 260 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం' అని ఓసీసీఆర్​పీ నివేదిక తెలిపింది.

ఆదానీ సామ్రాజ్యం..
ఆదానీ గ్రూప్​ అనేక వ్యాపారాలు నిర్వహిస్తోంది. రవాణా& లాజిస్టిక్స్​, సహజ వాయువు పంపిణీ, బొగ్గు ఉత్పత్తి& వాణిజ్యం, విద్యుత్​ ఉత్పత్తి, పంపిణీ, రహదారి నిర్మాణం, డేటా కేంద్రాలు, రియల్​ ఎస్టేట్​ సహా అనేక రంగాల్లో వ్యాపార, వాణిజ్యాలు నిర్వహిస్తోంది.

'ఆరోపణలన్నీ నిరాధారం'
ఓసీసీఆర్​పీ చేసిన తాజా ఆరోపణలను ఆదానీ గ్రూప్​ తీవ్రంగా ఖండించింది. వాస్తవానికి హిండెన్​బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలే .. ఓసీసీఆర్​పీ మళ్లీ చేసిందని పేర్కొంది. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేసింది. విదేశీ మీడియా సహకారంతో కొందరు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది.

  • On allegations of OCCRP, Adani Group says "We categorically reject these recycled allegations. These news reports appear to be yet another concerted bid by Soros-funded interests supported by a section of the foreign media to revive the meritless Hindenburg report. In fact, this… pic.twitter.com/hOfRU4BUSN

    — ANI (@ANI) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'అదో తప్పుడు నివేదిక.. ఆ అంశాలన్నీ 2015 నాటివే!'.. హిండెన్​బర్గ్​ రిపోర్ట్​పై అదానీ ఫైర్

ఏకంగా అదానీ కంపెనీకే షాక్.. 6వేల కేజీల ఇనుప వంతెన మాయం.. గ్యాస్​ కట్టర్​తో..

Last Updated : Aug 31, 2023, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.