ETV Bharat / business

Adani Group Stocks Fall : ఓసీసీ​ఆర్​పీ 'నివేదిక' ఎఫెక్ట్​.. కుదేలవుతున్న అదానీ గ్రూప్​ స్టాక్స్! - ambuja cement share price

Adani Group Stocks Fall : ఓసీసీఆర్​పీ నివేదిక సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆదానీ గ్రూప్​ షేర్లు భారీ పతనం దిశగా కొనసాగుతున్నాయి. అదానీ గ్రీన్​ ఎనర్జీ ఇప్పటికే 4 శాతానికి పైగా పతనం అయ్యింది.​ మిగతా అదానీ గ్రూప్​ షేర్లు కూడా నష్టాల దిశగా పయనిస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Adani Group Shares Fall
Adani Group Stocks Fall
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 12:26 PM IST

Updated : Aug 31, 2023, 12:50 PM IST

Adani Group Stocks Fall : గురువారం అదానీ గ్రూప్​ స్టాక్స్ అన్నీ భారీగా నష్టపోతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ ఇప్పటికే 4 శాతానికి పైగా నష్టపోయింది. అదానీ గ్రూప్​పై సంచలన ఆరోపణలు చేస్తూ, తాజాగా ఓసీసీఆర్​పీ ఓ నివేదిక విడుదల చేయడమే ఇందుకు కారణం.

అలీ, చాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు.. బిలియనీర్​ గౌతమ్​ అదానీ కుటుంబ సభ్యుల సమన్వయంతో నిబంధనలకు విరుద్ధంగా ఇన్​సైడర్​ ట్రేడింగ్​కు పాల్పడ్డారని, ప్రముఖ ఇన్వెస్టిగేటివ్​ రిపోర్టింగ్ ప్లాట్​ఫారం ఓసీసీఆర్​పీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ అదానీ గ్రూప్​ షేర్లను వదిలించుకుంటున్నారు. ఫలితంగానే గురువారం అదానీ గ్రూప్​ షేర్లు అన్నీ ఒక్కసారిగా కుదేలవడం ప్రారంభమైంది.

ఖండించినా.. లాభం లేదు!
OCCRP Report On Adani : ఓసీసీఆర్​పీ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్​ ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని పేర్కొంది. అయినప్పటికీ మదుపరులు అదానీ గ్రూప్ స్టాక్స్​ను వదిలించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.

భారీగా పతనం!

  • Adani Green Energy Share Price : రూ.1.47 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్​.. గురువారం బీఎస్​ఈలో 4.43 శాతం మేర నష్టపోయి రూ.927.65కు చేరుకుంది.
  • Adani Power Share Price : అదానీ పవర్​ స్టాక్​ 3.82 శాతం మేర నష్టపోయి రూ.315.85కు పడిపోయింది.
  • Adani Enterprises Share Price : అదానీ ఫ్లాగ్​షిప్ కంపెనీ ఆదానీ ఎంటర్​ప్రైజెస్​ 3.56 శాతం మేర కోల్పోయి రూ.2,424కు దిగజారింది.
  • Adani Energy Solutions Share Price : అదానీ ఎనర్జీ సొల్యూషన్స్​ 3.18 శాతం మేర క్షీణించి రూ.814.95కు పడిపోయింది.
  • Adani Ports And SEZ Share Price : అదానీ పోర్ట్స్​ అండ్ స్పెషల్ ఎకానమిక్​ జోన్​ స్టాక్​ 2.75 శాతం మేర నష్టపోయి రూ.796.50కు దిగివచ్చింది.
  • Adani Total Gas Share Price : అదానీ టోటల్ గ్యాస్​ 2.74 శాతం మేర క్షీణించి రూ.634.60కు చేరుకుంది.
  • NDTV Share Price : ఎన్​డీటీవీ షేర్​ ధర 2.69 శాతం మేర నష్టపోయి రూ.213.30కు దిగివచ్చింది.
  • Adani Wilmar Share Price : అదానీ విల్మర్​ స్టాక్ 1.83 శాతం మేర నష్టపోయి రూ.362.20కు పడిపోయింది.
  • ACC Share Price : అదానీ గ్రూప్​ ఆధ్వర్యంలోని ఏసీసీ షేర్ల వాల్యూ రూ.3.15 శాతం మేర తగ్గి రూ.1,937 వద్ద ట్రేడవుతోంది.
  • Ambuja Cement Share Price : అంబుజా సిమెంట్​ షేర్ విలువ 2.84 మేర క్షీణించి రూ.431.60 వద్ద కొనసాగుతోంది.

హిండెన్​బర్గ్​ నివేదిక
Hindenburg Research Report On Adani Group : గతంలో అమెరికాకు చెందిన షార్ట్​ సెల్లర్​ సంస్థ హిండెన్​బర్గ్ కూడా అదానీ గ్రూప్​పై ఇలాంటి ఆరోపణలే చేసింది. గౌతమ్​ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్​ కంపెనీలు.. భారతీయ చట్టాలను, స్టాక్ మార్కెట్​ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. అప్పట్లో దీనిని గౌతమ్ అదానీ పూర్తిగా ఖండించారు. కానీ, ఇప్పుడు ఓసీసీఆర్​పీ కూడా ఇదే విధంగా అదానీ గ్రూప్​పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో గౌతమ్​ అదానీ నేతృత్వంలోని అన్ని కంపెనీల షేర్లు భారీ పతనం దిశగా కదలాడుతున్నాయి.

Last Updated : Aug 31, 2023, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.