ETV Bharat / business

అదానీ కంపెనీకి భారత్‌ కంటే అధిక రేటింగ్‌!.. దేశంలోనే ఈ ఘనత సాధించే తొలి సంస్థగా.. - అదానీ కంపెనీ అధిక రేటింగ్​

ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీకి చెందిన ఒక కంపెనీ త్వరలోనే భారత సార్వభౌమ రేటింగ్‌ కంటే ఎక్కువ రేటింగ్‌ సాధించే అవకాశం ఉందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

adani
adani
author img

By

Published : Oct 14, 2022, 6:22 AM IST

Adani Company: అదానీ గ్రూప్‌నకు చెందిన ఒక కంపెనీ త్వరలోనే భారత సార్వభౌమ రేటింగ్‌ కంటే ఎక్కువ రేటింగ్‌ సాధించే అవకాశం ఉందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీకి చెందిన ఈ సంస్థ తన వ్యాపారంలో వేగవంతమైన వృద్ధిని, తక్కువ రుణాలను నమోదు చేస్తుండడమే ఇందుకు కారణమని, ఎంపిక చేసిన పెట్టుబడిదార్ల సమావేశంలో అదానీ గ్రూప్‌ సీఎఫ్‌ఓ జుగేషిందర్‌ సింగ్‌ పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ కంపెనీ పేరును సింగ్‌ తెలపలేదని ఆ సమావేశానికి హాజరైన ఆ వర్గాలు పేర్కొన్నాయి.

రిలయన్స్‌కు వచ్చింది కానీ..
ఎస్‌ అండ్‌ పీ, ఫిచ్‌ వంటి అంతర్జాతీయ రుణ రేటింగ్‌ సంస్థలు భారత్‌కు అతి తక్కువ పెట్టుబడి గ్రేడ్‌ రేటింగ్‌ అయిన ‘బీబీబీ-’ను ఇచ్చాయి. ప్రభుత్వ రంగ దిగ్గజాలతో పాటు చాలా వరకు కంపెనీలు ఈ రేటింగ్‌ లేదా అంతకంటే తక్కువ సార్వభౌమ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. గతేడాది జూన్‌లో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు భారత సార్వభౌమ రేటింగ్‌ కంటే ఒక మెట్టు ఎక్కువే ఫిచ్‌ రేటింగ్స్‌ ఇచ్చింది. అయితే దేశం వెలుపలా రిలయన్స్‌కు వ్యాపారాలున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే తన మొత్తం వ్యాపారాలుండి.. భారత్‌ కంటే అధిక రేటింగ్‌ సాధించనున్న తొలి భారతీయ కంపెనీ అదానీదదే అవుతుందని సింగ్‌ అంటున్నారు.

ఈ రెండింటిలోనేనా?
అదానీ గ్రూప్‌నకు ఉన్న 6 నమోదిత కంపెనీల్లో.. ప్రస్తుతం అదానీ ట్రాన్స్‌మిషన్‌కు సార్వభౌమ రేటింగ్‌కు సమానంగా రేటింగ్‌ ఉంది. దీనిని ఫిచ్‌ నుంచి బీబీబీ-(ప్రతికూల అంచనా); ఎస్‌ అండ్‌ పీ నుంచి బీబీబీ-; మూడీస్‌ నుంచి బీఏఏ3(స్థిర అంచనా) రేటింగ్‌ ఉన్నాయి. సంస్థ పునర్నిర్మాణం నేపథ్యంలో కంపెనీ విజ్ఞప్తి మేరకు ఎస్‌ అండ్‌ పీ తన రేటింగ్‌ను ఉపసంహరించుకుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీకి కూడా సార్వభౌమ రేటింగ్‌తో సమానంగా రేటింగ్‌ ఉంది. మరి ఈ రెండింటిలోనే ఒక కంపెనీ, సార్వభౌమ రేటింగ్‌ను మించిన రేటింగ్‌ సాధించనుందా లేదంటే మరో కంపెనీయా అన్నది తెలియరాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.