Aadhar Card Photo Change Process : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIADI) భారత పౌరులకు అందించే గుర్తింపు కార్డే ఆధార్. ఇది అడ్రస్ ప్రూఫ్‌గానూ ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలు పొందాలంటే ఇది తప్పనిసరి అయిపోయింది. అందుకే దీనిలోని ఫొటో, అడ్రస్, మొబైల్ నంబర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అయితే కొన్నిసార్లు ఆధార్ కార్డులోని ఫొటో బాగా లేకపోవడమో, చిరునామా తప్పుగా ఉండడమో, లేదా పుట్టిన తేదీ సరిగ్గా లేకపోవడమో జరుగుతుంది. అప్పుడు వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇదేమంత కష్టమైన పనికాదు. ఆధార్ వివరాలను చాలా సులువుగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Steps To Change Aadhar Card
ఆధార్ కార్డులోని మీ ఫొటోను నేరుగా ఆన్లైన్లో మార్చుకోవడానికి వీలుపడదు. అందువల్ల సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ రూ.100 రుసుము చెల్లిస్తే, సింపుల్‌గా మీ ఫొటోను, బయోమెట్రిక్స్‌ను వారు అప్డేట్ చేస్తారు. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే,
- ముందుగా మీ దగ్గర్లోని ఆధార్ పర్మినెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాలి.
- ఫొటో మార్చడానికి కావాల్సిన దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి. లేదా
- ఆధార్ సెంటర్లో అప్లికేషన్ ఫారమ్ తీసుకుని, దానిలో మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- ఆధార్ సెంటర్వారికి రూ.100 రుసుము చెల్లించాలి.
- ఆధార్ సెంటర్‌వారు మీ ఫొటోను తీసుకుని అప్డేట్ చేస్తారు.
- మీ బయోమెట్రిక్ వివరాలను కూడా ఆధార్ సెంటర్ వాళ్లే అప్డేట్ చేస్తారు.
అప్డేటెడ్ ఆధార్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోండిలా!
- ఆధార్ సెంటర్‌కు వెళ్లి, మీ ఫొటో, బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకున్న తరువాత, UIDAI అధికారిక పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
- హోమ్ పేజ్‌లోని My Aadhar సెక్షన్లోకి వెళ్లాలి.
- Download Aadharపై క్లిక్ చేయాలి. తరువాత,
- ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ నమోదు చేయాలి.
- అక్కడ ఉన్న క్యాప్చాను కూడా ఎంటర్ చేయాలి.
- వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
- ఈ ఓటీపీని నమోదు చేసిన వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తరువాత,
- మీ లేటెస్ట్ ఈ-ఆధార్ కార్డ్ కనిపిస్తుంది. దానిని సింపుల్‌గా డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ ఆధార్ కార్డుకు పాస్వర్డ్ ప్రొటక్షన్ ఉంటుంది. కనుక దీనిని ఓపెన్ చేయాలంటే, మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను క్యాపిటల్ లెటర్స్‌లో నమోదు చేయాలి. అలాగే మీరు పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడే మీ ఆధార్ కార్డు వివరాలు కనిపిస్తాయి.
నోట్ : మీరు కావాలనుకుంటే, వర్చువల్ ఆధార్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విదేశాల్లోనూ గూగుల్ పే సేవలు- తగ్గనున్న ఛార్జీల భారం
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-7 టిప్స్ మీ కోసమే!