330 RS Deducted From SBI Account : మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.330 కట్ అయ్యాయా? ఎందుకు అంత మొత్తంలో ఖాతా నుంచి డెబిట్ అయ్యిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇకపై ఆ డబ్బులు మీ అకౌంట్ నుంచి కట్ కాకుండా ఉండాలా? అందుకు ఏం చేయాలో ఓ సారి తెలుసుకుందాం.
దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రజలు అకౌంట్ ఓపెన్ చేస్తారు. అయితే ఏటీఎం, ఎస్ఎంఎస్ ఛార్జీలంటూ ఏడాదిలో చాలా సార్లు కస్టమర్ల అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఈ క్రమంలో కస్టమర్లు ఎందుకు ఇంతలా తమ అకౌంట్ నుంచి బ్యాంక్‌లు డబ్బులను కట్ చేస్తున్నాయని వాపోతుంటారు. కానీ ప్రభుత్వ సూచన, అభీష్టం మేరకు కొన్ని పాలసీలను కస్టమర్లే తీసుకుంటారు. అది మీరు తీసుకున్న ఓ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించినదే. ఆ పాలసీ పేరే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన( పీఎంజేజేబీవై). ఏడాదికి రూ.330 ఆ పాలసీ ప్రీమియం కోసం ఏటా కట్ అవుతాయి.
మీ ఖాతా నుంచి రూ.330 ఎందుకు కట్ అవుతుందంటే?
మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.330 కట్ అయినట్లయితే.. అవి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై) ప్రీమియంకు మీరు చెల్లించినట్లు. అది మీ అంగీకారం ప్రకారమే బ్యాంక్ కట్ చేస్తుంది.
అసలేంటీ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన?
PMJJBY Policy Details In Telugu : ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీకి ప్రీమియం రూ.330. గుర్తింపు పొందిన బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్న 18-50 ఏళ్ల లోపు వ్యక్తులు దీనికి అర్హులు. ఆదాయంతో నిమిత్తం లేదు. ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలున్నా.. పాలసీ ఒకటే ఇస్తారు. ఇది ఏటా జూన్ 1న ప్రారంభం అవుతుంది. ఈ పథకంలో కొత్తగా చేరితే.. నమోదు చేసిన 45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుదారులు ఏ కారణంతో మరణించినా.. రూ.2లక్షల బీమా పరిహారం అందుతుంది.
ఈ పాలసీ నిబంధనలేంటి?
SBI PMJJBY Policy Details : హత్య, ఆత్మహత్యలకు కూడా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ వర్తిస్తుంది. అందుకే కొవిడ్-19 కారణంగా మరణించిన వారికీ ఈ బీమా పాలసీ రూ.2లక్షల పరిహారం చెల్లిస్తుంది. దురదృష్టవశాత్తూ ఎవరైనా చనిపోతే.. వారి నామినీలు 30 రోజుల్లోగా పాలసీ ఉన్న బ్యాంకు శాఖను సంప్రదించి క్లెయిం కోసం దాఖలు చేయాలి. క్లెయిం సమర్పించిన 30 రోజుల్లోగా బ్యాంకు ఆ క్లెయిం ఫారాన్ని సంబంధింత బీమా కంపెనీకి పంపిస్తుంది.
మీకు పీఎంజేజేబీవై పాలసీ నుంచి వైదొలగడం ఎలా?
How To Cancel PMJJBY In SBI : పీఎంజేజేబీవై పాలసీ నుంచి వైదొలగాలంటే మీకు ఖాతా ఉన్న బ్యాంక్‌ను సంప్రదించాలి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పాలసీని నిలిపివేయమని దరఖాస్తు/ ఫారమ్‌ను బ్యాంకు అధికారులకు సమర్పించాలి. బ్యాంక్ మీ అభ్యర్థనను నిశితంగా పరిశీలించి.. కొద్ది రోజుల్లో మీ అభ్యర్థనకు అంగీకారం తెలుపుతుంది. అప్పుడు మీ అకౌంట్ నుంచి రూ.330 కట్ అవ్వవు. అయితే.. అతి తక్కువ ప్రీమియంకే రూ.2లక్షల బీమా అందిస్తున్న పథకంలో కొనసాగడమే మేలన్నది నిపుణుల మాట.
How to Get PPO Number in Online : ప్రైవేట్ ఉద్యోగులారా.. పీపీఓ నంబర్ తెలుసుకున్నారా..?