ఒడుదొడుకుల ట్రేడింగ్ మధ్య దేశీయ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(BSE sensex ) 254 పాయింట్లు నష్టపోయి 59,413వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty) 37 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,711కు చేరింది. ఎఫ్ఎమ్సీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొగా.. ఫార్మా, ఐటీ షేర్ల కొనుగోలుకు మదుపరులు ఎక్కువ ఆసక్తి చూపించారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 59,678 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 59,111 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 17,782 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 17,608 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి షేర్లు..
ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, ఎస్బీఐఎన్, టాటాస్టీల్, హెచ్‌సీఎల్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాలు గడించాయి.
హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇవీ చదవండి: