ETV Bharat / business

'టీకా'కు బ్రేక్​తో మార్కెట్లకు నష్టాలు

అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 171, నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయాయి.

markets close
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Sep 9, 2020, 3:42 PM IST

Updated : Sep 9, 2020, 5:40 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 171 పాయింట్లు క్షీణించి 38,194 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 11,278 పాయింట్లకు పడిపోయింది.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ క్యాండిడేట్ ట్రయల్స్​ తాత్కాలికంగా నిలిచిపోవటం వల్ల అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.

ప్రభుత్వ రంగం బ్యాంకులు.. ముఖ్యంగా ఎస్​బీఐ షేర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. ఎస్​బీఐ షేర్లు 4 శాతం మేర క్షీణించాయి.

లాభనష్టాల్లో...

టాటాస్టీల్​, రిలయన్స్​, సన్​ఫార్మా, భారతి ఎయిర్​టెల్​, నెస్లే, ఏషియన్ పెయింట్స్​ షేర్లు రాణించాయి.

ఎస్​బీఐ, బజాజ్​ఫిన్​సర్వ్​, యాక్సిస్​బ్యాంక్, ఓఎన్​జీసీ, ఐటీసీ, బజాజ్​ ఫైనాన్స్​, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లు...

షాంఘై, జపాన్​, దక్షిణ కొరియా, హాంకాంగ్​ సహా ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి.

ఐరోపా మార్కెట్లు మిడ్​ సెషన్​ సమయానికి స్వల్ప లాభాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: రిలయన్స్​లో సిల్వర్​ లేక్​ రూ.7,500 కోట్ల పెట్టుబడులు

Last Updated : Sep 9, 2020, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.