ETV Bharat / business

'క్రిప్టోకరెన్సీల నిషేధానికిి కేంద్రం కసరత్తు!' - క్రిప్టోకరెన్సీల నిషేధానికి కేంద్రం కొత్త చట్టం

క్రిప్టోకరెన్సీ.. ఇటీవల విపరీతంగా వినిపిస్తున్న పదం. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం, వీటిపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. భారత్​లోనూ వీటిల్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా మందే ఉన్నారు. అయితే వారికి కేంద్రం షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశంలో క్రిప్టోకరెన్సీల నిషేధానికి కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానునట్లు సమాచారం.

cryptocurrencies again in India
భారత్​లో క్రిప్టోకరెన్సీల నిషేధం
author img

By

Published : Mar 16, 2021, 3:46 PM IST

భారత్​లో క్రిప్టోకరెన్సీలను నియంత్రించేందుకు కేంద్రం కొత్త చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్ ఇదివరకే వెల్లడించారు. అయితే ఈ కొత్త చట్టం క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడులు, వాటి వినియోగాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ లేదనే కారణంగా ఆర్​బీఐ ఇదే వరకే ఓ సారి వాటిని నిషేధించింది. అయితే సుప్రీం కోర్టు జోక్యంతో ఎత్తివేయక తప్పలేదు. దీనితో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. చట్ట బద్ధంగా క్రిప్టో కరెన్సీలను నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

  • కొత్త చట్టానికి సంబంధించిన బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. అధికార పార్టీకి కావాల్సినంత మెజారిటీ ఉన్నందున బిల్లు.. చట్టంగా మారడం లాంఛనమే కానుంది.
  • చట్టం అమలులోకి వస్తే ఇప్పటికే క్రిప్టోకరెన్సీల్లో ఉన్న పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చుకునేందుకు ఆరు నెలల గడువు ఉంటుంది.
  • క్రిప్టోకరెన్సీ మదుపరులు, మైనింగ్ చేసే వారిపై క్రిమినల్​ కేసులు పెట్టేందుకు కూడా ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి అధికారాలు రానున్నాయి. అయితే వారికి సంబంధించిన శిక్షలపై ఇంకా స్పష్టత లేదు. 2019లో ఇదే అంశంపై చర్చ జరగగా.. క్రిప్టోకరెన్సీకి సంబంధించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం సూచించింది.

ఇదీ చదవండి:మీడియాలో వాటా విక్రయానికి జాక్​ మాపై చైనా ఒత్తిడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.