స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశ ఆర్థిక మందగమనం సెగ సూచీలను కిందకు లాగుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం, దేశీయ మార్కెట్లపై మదుపర్ల విశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లడమూ... నష్టాలకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచి సెన్సెక్స్ 122 పాయింట్లు కోల్పోయి 36 వేల 937 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి సూచి నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 10 వేల 874 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో
బ్రిటానియా, ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంకు, టీసీఎస్, టెక్ మహీంద్ర, రెడ్డీ ల్యాబ్స్, ఐటీసీ, యూపీఎల్, లార్సెన్, హెచ్‌యూఎల్, ఎమ్ అండ్ ఎమ్, ఏసియన్ పెయింట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో
ఇండియా బుల్స్, బజాజ్ ఫెన్సెర్వ్, ఆదాణీ పోర్ట్స్, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంకు, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటాస్టీల్, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
హాంకాంగ్, కొరియా, షాంగై, జపాన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా బుధవారం వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజిలు లాభాలతో ముగిశాయి.
రూపాయి
రూపాయి విలువ ప్రారంభ ట్రేడింగ్‌లో 10 పైసలు తగ్గి... ఒక డాలరుకు రూ.71.66గా ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు 0.17 శాతం తగ్గాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ ముడిచమురు ధర 60.20 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: పూలు అమ్మినచోటే కట్టెలు అమ్ముతున్న నేత