14,500 దిగువకు నిఫ్టీ..
ఆరంభ లాభాలు ఆవిరై భారీ నష్టాల్లోకి జారుకున్నాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 820 పాయింట్లకుపైగా కోల్పోయి 48,973 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 230 పాయింట్లకుపైగా నష్టంతో 14,484 వద్ద కొనసాగుతోంది.
ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో భారీ ఎత్తున అమ్మకాలు నమోదవుతుండటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదవుతుండటం వల్ల పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆక్షలు విధించాయి. మరిన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు వస్తున్న వార్తలు మదుపరుల సెంటిమెంట్ దిబ్బతీసినట్లు స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.
- ఐటీసీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, ఎం&ఎం లాభాల్లో ఉన్నాయి.
- ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, డాక్టర్రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.