బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ - సెన్సెక్స్ మరోసారి 40 వేల పాయింట్ల మార్కును దాటింది. 302 పాయింట్ల లాభంతో 40వేల16 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 వేల మార్కును దాటింది. 85 పాయింట్ల లాభంతో 12వేల08 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో షేర్ల కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
మే 23న స్టాక్‌మార్కెట్లకు రికార్డు స్థాయి లాభాలొచ్చాయి. ఆ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా రావడం వల్ల 40 వేల మార్కును దాటిన సెన్సెక్స్... నేటి ట్రేడింగ్‌లోనూ ఆ దిశగానే దూసుకెళ్లింది.
హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, ఐఓసీ అత్యధిక లాభాలు సాధించిన సంస్థల జాబితాలో ఉన్నాయి.
ఓఎన్జీసీ, ఐటీసీ, గెయిల్, టెక్ మహీంద్రా నష్టాల్లోకి వెళ్లాయి.