దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(Sensex today) 80 పాయింట్లు పతనమై.. 60,352 వద్ద సెషన్‌ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 27 పాయింట్ల నష్టంతో 18,017 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
60,295 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 60,506 పాయింట్ల గరిష్ఠ తాకింది. అనంతరం నష్టాల్లోకి జారుకుంది. ఒడుదొడుకుల మధ్య జరిగిన ట్రేడింగ్‌లో ఓ దశలో 59,967 కనిష్ఠానికి చేరుకుంది.
నిఫ్టీ 17,973 వద్ద ప్రారంభమై.. ఇంట్రాడేలో 17,915-18,061 మధ్య కదలాడింది.
లాభనష్టాలు..
- భారతీ ఎయిర్టెల్ 3.30 శాతం, ఎం అండ్ ఎం 2.74 శాతం, సన్‌ఫార్మా 1.14 శాతం, రిలయన్స్ 0.95 శాతం, ఐటీసీ 0.92 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.76 శాతం లాభాలు గడించాయి.
- ఇండస్‌బ్యాంకు 3.21 శాతం, టాటాస్టీల్ 2.77 శాతం, హిందుస్థాన్ యూనిలివర్ 1.31 శాతం, ఏసియన్పెయింట్స్ 1.11 శాతం, టైటాన్ 1.07 శాతం, ఎస్బీఐఎన్ 1.04 శాతం నష్టాలు మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ఆఖరి రోజు అదరగొట్టిన పేటీఎం ఐపీఓ!