స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు నాలుగు సెషన్ల నష్టాల తర్వాత లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 534 పాయింట్లు బలపడి 59,299 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 17,691 వద్దకు చేరింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు భారీగా నష్టపోయాయి. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు సెలవులో ఉన్నాయి.