భారీ నష్టాల్లో మార్కెట్లు..
బ్యాంకింగ్, వాహన రంగాల షేర్లు ఢీలా పడటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో 37,847కి పడిపోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 11,161 పాయింట్లకు చేరుకుంది.
లాభ నష్టాల్లో..
ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, టాటా స్టీల్, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్, టైటాన్ లాభాల్లో ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, మారుతి, బజాజ్ నష్టాల్లో ఉన్నాయి.