14,500 పైకి నిఫ్టీ..
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 660 పాయింట్లకుపైగా పెరిగి 48,538 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 180 పాయింట్ల లాభంతో 14,519 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
బ్యాంకింగ్ షేర్ల జోరు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
- ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- హెచ్‌సీఎల్‌టెక్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.