అంతర్జాతీయ ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 422 పాయింట్లు క్షీణించి 38,072 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 108 పాయింట్లు నష్టపోయి 11,192 గా స్థిరపడింది.
అమెరికా ఫెడరల్ బ్యాంకు త్వరలో ద్రవ్యపరపతి విధానం ప్రకటించనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే దేశీయ మార్కెట్లు నష్టపోయాయి.
లాభనష్టాల్లో..
టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్ సహా 30 షేర్ల ఇండెక్స్‌లోని 11 సంస్థల షేర్లు లాభాల్లో ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇదీ చూడండి: మూడో త్రైమాసికం నుంచి మళ్లీ నెమ్మదే: ఆక్స్ఫర్డ్