ఒడుదొడుకుల సెషన్లో స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్(Sensex today) అతి స్వల్పంగా 14 పాయింట్లు పెరిగి 52,589 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 26 పాయింట్ల లాభంతో 15,773 వద్దకు చేరింది.
సెషన్ మొత్తం ఒడుదొడుకుల్లో సాగగా.. ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి సూచీలు. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఒడుదొడుకులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 53,057 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవన కాల గరిష్ఠం), 52,520 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,895 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,752 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
మారుతీ, ఎల్&టీ, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, టైటాన్, ఇన్ఫోసిస్ ప్రధానంగా లాభాలను గడించాయి.
ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. హాంగ్‌సెంగ్ సూచీ మాత్రం నష్టాలతో ముగిసింది.
ఇదీ చదవండి:విద్యుత్ వాహనాల మార్కెట్ ఏటా 26శాతం వృద్ధి!