వారాంతపు సెషన్‌ను స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 48,832 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 36 పాయింట్లు బలపడి 14,617 వద్ద ముగిసింది. మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది మూడో సెషన్.
ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 49,089 పాయింట్ల అత్యధిక స్థాయి: 48,694 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,697 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,559 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌టెక్, నెస్లే షేర్లు లాభాలతో ముగిశాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎల్&టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి.
ఇదీ చదవండి:రూ.10 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే పన్ను?