మార్కెట్ ఆరంభం నుంచే లాభాల్లో కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం జీవితకాల గరిష్ఠాలను చేరి కొత్త రికార్డు సృష్టించాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ తొలిసారి 61వేల మార్కును దాటింది.
సెన్సెక్స్ 550 పాయింట్లకుపైగా లాభపడింది. 61,334 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 175 పాయింట్లు వృద్ధి చెంది 18,338 వద్దకు చేరింది. అంతర్జాతీయ సానుకూలతలకు తోడు.. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో సూచీలు పరుగులు పెట్టాయి.