దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సూచీ 42 పాయింట్ల నష్టంతో 40వేల 73కి తగ్గింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 11వేల 813 వద్ద ట్రేడ్ అవుతోంది.
స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరచడం, అంతర్జాతీయంగా ప్రతికూలతలు వంటి కారణాలు మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
ఎస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, మారుతీ షేర్లు 2 శాతానికి పైగా మెరుగుపడ్డాయి.
భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్, ఎస్బీఐ, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్ షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి.