ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు-వొడాఫోన్ షేర్లు పతనం - స్టాక్ మార్కెట్లు

ఆసియా మార్కెట్ల పతనంతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 411 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయాయి. వొడాఫోన్​ ఐడియా షేర్లు 16 శాతం మేర పడిపోయాయి.

stocks-voda
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Feb 18, 2020, 12:53 PM IST

Updated : Mar 1, 2020, 5:19 PM IST

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 411 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​ 40,644 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 128 పాయింట్ల మేర నష్టపోయింది.

కరోనా వైరస్​ మృతుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. మరోవైపు ఏజీఆర్ బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది.

వొడాఫోన్​ షేర్లు..

వొడాఫోన్​ ఐడియా షేర్లు భారీగా పడిపోయాయి. సంస్థకు 'కేర్'​ రేటింగ్స్​ తగ్గించిన నేపథ్యంలో 16 శాతం షేర్లు నష్టపోయాయి. ఇందుకు ఏజీఆర్​ బకాయిలతోపాటు సంస్థకు సంబంధించిన మరిన్ని సమస్యలు ప్రభావం చూపాయి.

Last Updated : Mar 1, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.