ETV Bharat / business

రిలయన్స్ దూకుడు- సెన్సెక్స్ 646 పాయింట్లు ప్లస్

హెవీవెయిట్​ షేర్ల దూకుడుతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 646 పాయింట్లు పుంజుకుని 38,840 పాయింట్లకు పెరిగింది. నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 11,449కు చేరింది.

STOCKS UPDATE
స్టాక్ మార్కెట్
author img

By

Published : Sep 10, 2020, 3:42 PM IST

Updated : Sep 10, 2020, 4:19 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 646 పాయింట్లు బలపడి 38,840 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 11,449 వద్దకు చేరింది.

హెవీ వెయిట్​ షేర్ల దూకుడు..

రిలయన్స్, యాక్సిస్​, బ్యాంక్​, ఏషియన్​ పెయింట్స్​ వంటి హెవీవెయిట్​ షేర్ల దన్ను, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు లాభాలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

బీఎస్​ఈలో దాదాపు 100 దిగ్గజ సంస్థ షేర్ల విలువ 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. రిలయన్స్​ షేర్లు సుమారు 7 శాతం లాభపడ్డాయి.

STOCKS
స్టాక్ మార్కెట్ ముఖ్యాంశాలు

తొలి కంపెనీగా రిలయన్స్​..

రిలయన్స్​ మార్కెట్​ విలువ భారీగా పెరిగింది. దేశంలో 200 బిలియన్​ డాలర్లకు చేరిన తొలి సంస్థగా అవతరించింది. రిటైల్​ వ్యాపారంలో ప్రముఖ ఈక్విటీ సంస్థ సిల్వర్​ లేక్​ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్​ షేర్లపై మదుపరులు ఆసక్తి చూపారు. ఫలితంగా రిలయన్స్ షేరు విలువ జీవిత కాల గరిష్ఠాన్ని చేరుకుంది.

లాభనష్టాల్లో..

రిలయన్స్​, ఏషియన్​ పెయింట్స్​, యాక్సిస్​ బ్యాంక్, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ లాభపడ్డాయి.

టాటా స్టీల్​, భారతీ ఎయిర్​టెల్​, కొటక్​ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు వెనకబడ్డాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

ఆసియాలో హాంకాంగ్​, షాంఘై మార్కెట్లు నష్టపోగా.. జపాన్​, దక్షిణ కొరియా సూచీలు లాభాలతో ముగిశాయి.

జర్మనీ మినహా ఐరోపా మార్కెట్లన్నీ నష్టాల్లో సాగుతున్నాయి.

ఇదీ చూడండి: రిలయన్స్​లో సిల్వర్​ లేక్​ రూ.7,500 కోట్ల పెట్టుబడులు

Last Updated : Sep 10, 2020, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.