అమెరికా-చైనా వాణిజ్య వివాదానికి తెరపడుతుందన్న ఆశల నడుమ దేశీయ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 94 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 39 వేల 687 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రారంభ సెషన్లో 11 వేల 850 మార్కును దాటింది. ప్రస్తుతం 28 పాయింట్ల స్వల్ప లాభంతో 11 వేల 876 వద్ద ఉంది.
ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.
లాభనష్టాల్లోనివివే...
ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్స్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి.
బ్రిక్‌వర్క్ రేటింగ్స్ తగ్గించినందున కాక్స్ అండ్ కింగ్స్ షేర్లు ఆరంభట్రేడింగ్లోనే 10 శాతం పడిపోయాయి. 52 వారాల కనిష్ఠాన్ని చేరాయి.
సన్ ఫార్మా, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, ఐఓసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయిన కంపెనీల జాబితాలో ఉన్నాయి.
ఆరంభట్రేడింగ్లో రూపాయి 11 పైసలు క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 69.26 వద్ద ట్రేడవుతోంది.