ETV Bharat / business

మార్కెట్లకు నష్టాలు- ఎయిర్​టెల్ 7 శాతం డౌన్ - stock markets latest updates

stock markets open on high note
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Sep 23, 2020, 9:31 AM IST

Updated : Sep 23, 2020, 3:52 PM IST

15:48 September 23

వీడని భయాలు.

ఆరంభ లాభాలను మదపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు తగ్గి 37,668 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 11,132 వద్దకు చేరింది.

  • యాక్సిస్ బ్యాంక్, హెచ్​యూఎల్​, ఇన్ఫోసిస్, నెస్లే, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
  • భారతీ ఎయిర్​టెల్ అత్యధిక నష్టాన్ని నమోదు చేసింది. టాటా స్టీల్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

13:06 September 23

అప్రమత్తత..

మిడ్​ సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా కోల్పోయి 37,628 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా తగ్గి 11,109 వద్ద కొనసాగుతోంది.

  • హెచ్​డీఎఫ్​సీ, హెచ్​యూఎల్​, నెస్లే, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్, టీసీఎస్, ఎన్​టీపీసీ, టాటా స్టీల్, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ట్రేడవుతున్నాయి.

11:40 September 23

హెచ్​సీఎల్​టెక్ జోరు..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 190 పాయింట్ల లాభంతో 37,923 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పెరిగి 11,206 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్ రిటైల్​లో కేకేఆర్​ గ్రూప్ పెట్టుబడి ప్రకటనతో ఆ సంస్థ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఇతర హెవీ వెయిట్​ షేర్లూ సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్​టెక్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్​ పెయింట్స్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్, టాటా స్టీల్, ఎన్​టీపీసీ, టీసీఎస్​, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:20 September 23

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 280 పాయింట్లు ప్లస్​

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 288 పాయింట్లు వృద్ధి చెంది 38022కి చేరింది. నిఫ్టీ 82 పాయింట్లు మెరుగుపడి 11,235 వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్ , సన్ ఫార్మా షేర్లు దూసుకుపోతున్నాయి.

Last Updated : Sep 23, 2020, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.