14,400 దిగువకు నిఫ్టీ..
స్టాక్ మార్కెట్లు వారంలో మొదటి సెషన్‌ను భారీ నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 883 పాయింట్ల నష్టంతో 47,949 వద్దకు చేరింది. నిఫ్టీ 258 పాయింట్లు కోల్పోయి 14,359 వద్ద స్థిరపడింది.
30 షేర్ల ఇండెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ స్వల్పంగా లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ భారీగా నష్టపోయాయి.