32 వేల ఎగువకు సెన్సెక్స్...
ఉదయం నుంచి ఆటుపోట్ల మధ్య జరిగిన ట్రేడింగ్‌లో వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 371 పాయింట్లు బలపడి 32,114 వద్దకు చేరింది. నిఫ్టీ 99 పాయింట్ల వృద్ధితో 9,381 వద్ద స్థిరపడింది.
ఒడుదొడుకుల్లోనూ ఆర్థిక రంగం షేర్లు సానుకూలంగా స్పందించడం నేటి లాభాలకు ప్రధాన కారణం.
30 షేర్ల ఇండెక్స్‌లో...
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
సన్‌ఫార్మా, నెస్లే, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు నష్టాల జాబితాలో ఉన్నాయి.