ETV Bharat / business

మార్కెట్ల రికార్డు పతనం- బ్యాంకింగ్ షేర్లు బేజారు - ఎన్​ఎస్​ఈ నిఫ్టీ

Stock markets live updates
బ్యాంకింగ్​ షేర్లకు అమ్మకాల ఒత్తిడి- భారీ నష్టాల్లో మార్కెట్లు
author img

By

Published : Feb 26, 2021, 9:27 AM IST

Updated : Feb 26, 2021, 3:53 PM IST

15:31 February 26

నిఫ్టీ 576 మైనస్​

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో కుప్పకూలాయి. సెన్సెక్స్ 1939 పాయింట్ల నష్టంతో 49,099 వద్దకు చేరింది. నిఫ్టీ 568 పాయిట్లు కోల్పోయి 14,529 వద్ద స్థిరపడింది.

30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఓఎన్​జీసీ, ఎం&ఎం, పవర్​గ్రిడ్​, బజాజ్ ఫిన్​సర్వ్​, యాక్సిస్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:11 February 26

Sensex
30 షేర్ల ఇండెక్స్

స్టాక్ మార్కెట్లలో బేర్​ స్వైరవిహారం చేస్తోంది. సెన్సెక్స్ 1,620 పాయింట్లకుపైగా నష్టంతో 49,419 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 460 పాయింట్లు తగ్గి.. 14,635 వద్ద కొనసాగుతోంది.

11:55 February 26

భారీ పతనం..

స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1,460 పాయింట్లకుపైగా నష్టంతో 49,574 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 430 పాయింట్లు కోల్పోయి 14,670 వద్ద కొనసాగుతోంది. ఈ స్థాయి నష్టాలు ఇటీవలి నెలల్లో ఇదే ప్రథమం.

ఫార్మా మినహా మిగతా అన్ని రంగాలు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

  • సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్​, ఎన్​టీపీసీ, మారుతీ, నెస్లే కంపెనీలు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్​, ఎం&ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

10:41 February 26

రూపాయి పతనం...

ఫారెక్స్ మార్కెట్​లో రూపాయి భారీ పతనం దిశగా పయనిస్తోంది. ఆరంభ సెషన్​లో మారకం విలువ డాలర్​తో పోలిస్తే.. 67 పసైలు తగ్గి 73 వద్దకు చేరింది.

ఆసియాలో ఇతర కరెన్సీలు బలహీనపడుతుండటం, ఈక్విటీ మార్కెట్​లో నమోదవుతున్న భారీ అమ్మకాలు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.39 శాతం క్షీణతతో.. బ్యారెల్ ధర 66.62 డాలర్ల వద్ద ఉంది.

10:27 February 26

బ్యాంకింగ్ షేర్లు డీలా..

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1111 పాయింట్లకుపైగా కోల్పోయి 49,928 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 280 పాయింట్లకుపైగా నష్టంతో 14,817 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు, శుక్రవారం 2020-21 క్యూ3 జీడీపీ అధికారిక గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్​పై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో నమోదవుతున్న అమ్మకాలు భారీ నష్టాలకు దారితీస్తున్నాయి.

ఫార్మా, టెలికాం మినహా దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

  • సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, డాక్టర్​ రెడ్డీస్, మారుతీ, అల్ట్రాటెక్​ సిమెంట్, భారతీ ఎయిర్​టెల్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్ఇండ్​ బ్యాంక్, హెచ్​డీఎప్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎం&ఎం షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

09:16 February 26

లైవ్​: రికార్డు స్థాయి నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

బ్యాంకింగ్​, లోహ రంగ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవడం వల్ల దేశీయ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 863 పాయింట్లు నష్టపోయి 50,175 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 228 పాయింట్లు కోల్పోయి 14,868 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్​, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

భారతీఎయిర్​టెల్​, మారుతి షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Last Updated : Feb 26, 2021, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.