కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిపై ఆందోళనలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. బ్రిటన్‌లో ఆంక్షలు, ఐరోపా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమవటం వల్ల దేశీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఒకదశలో ఏకంగా 1,500 పాయింట్లకుపైగా నష్టపోయింది. చివరకు 1406 పాయింట్ల నష్టంతో 45,553 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ-30లోని దాదాపు అన్ని షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి.
- బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్.. 1406 పాయింట్ల నష్టంతో 45,553 పాయింట్ల వద్ద స్థిరపడింది.
- జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ.. 432 పాయింట్ల క్షీణతతో 13,328 పాయింట్ల వద్ద ముగిసింది.