ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతుందన్న అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,266 పాయింట్ల వృద్ధితో 31,160 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 363 పాయింట్లు లాభపడి 9,112 వద్ద ముగిసింది.
కరోనా రివర్స్ గేర్పై ఆశలు- సూచీలు టాప్ గేర్ - నిఫ్టీ
15:41 April 09
13:35 April 09
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్ల వృద్ధితో 30 వేల 990 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 320 పాయింట్ల లాభంతో 9 వేల 70 వద్ద ట్రేడవుతోంది.
09:37 April 09
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం మరింత పెరగపోవచ్చన్న అంచనాల మధ్య దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వైరస్ ఇన్ఫెక్షన్ల రేటులో తగ్గుదల నమోదు కావడం... మదుపర్లపై సానుకూల ప్రభావం చూపింది.
ఫలితంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ భారీగా వృద్ధి చెందింది. 800పైగా పాయింట్ల లాభంతో 30,730 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 షేర్లలో హిందూస్థాన్ యూనిలివర్ మినహా అన్నీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ కంపెనీలకు చెందిన షేర్లు దూసుకుపోతున్నాయి.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతో ప్రారంభమైంది. 262 పాయింట్లు లాభపడిన సూచీ.. 9 వేల మార్క్ ఎగువన కొనసాగుతోంది.
09:18 April 09
లాభాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 800+
స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా వృద్ధి చెంది 30 వేల 700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 230 పాయింట్ల లాభంతో 8,980 వద్ద కొనసాగుతోంది.