ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు లాభాలు- నిఫ్టీ@14,940!

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 296 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 119 పాయింట్లు పుంజుకుని 14,900 మార్క్​ను దాటింది.

stocks close
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : May 10, 2021, 3:38 PM IST

Updated : May 10, 2021, 3:53 PM IST

లోహ, ఫార్మా షేర్ల దన్నుతో సోమవారం స్టాక్​ మార్కెట్లు రాణించాయి. సెన్సెక్స్ 296 పాయింట్లు పుంజుకుని 49,502 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో.. 14,942 వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ఉండదనే ధీమాకు తోడు.. అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే.. ఈక్విటీ మార్కెట్​ల మెరుగైన పనితీరు, మార్చి త్రైమాసిక ఆదాయాలు మార్కెట్​లకు లాభాలు తెచ్చిపెట్టినట్లు వివరించారు.

ఇంట్రాడే సాగిందిలా..

బొంబాయి స్టాక్​ ఎక్సేంజీ సూచీ 49,412 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని.. 49,617 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-నిఫ్టీ 14,892 పాయింట్ల అత్యల్ప స్థాయిని, 14,967 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

లాభనష్టాల్లోనివి..

ఎల్ అండ్ టీ​, డాక్టర్ రెడ్డీస్, సన్​ ఫార్మా, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, ఓఎన్​జీసీ ఐటీసీ, టీసీఎస్​, ఎస్​బీఐఎన్​, భారతీ ఎయిర్​టెల్, అదానీ పోర్ట్​, ఎంఅండ్​ఎం లాభాలతో ముగిశాయి.

అల్ట్రాటెక్​ సిమెంట్, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్​సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ ష్టాలను మూటగట్టుకున్నాయి.

Last Updated : May 10, 2021, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.